ఆరోగ్యవంతమైన భారత్ కల నెరవేరుతోంది

వారణాసిలో ‘పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తూ ఆరోగ్యవంతమైన భారతదేశం కల నెరవేరుతోందని చెప్పారు. పేదలకు మౌలిక సౌకర్యాలు కల్పించడమే బిజెపి ప్రాధాన్యతని ప్రధాని తెలిపారు. 

జాతీయ ఆరోగ్య మిషన్‌కు అందనంగా దేశవ్యాప్తంగా ఆరోగ్యరక్షణ మౌలికవసతుల పటిష్టం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అతిపెద్ద పాన్ ఇండియా పథకాలలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలికవసతుల మిషన్ ఒకటి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ వైద్యరంగంలో క్రిటికల్ కేర్, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణను పటిష్టపరచడమే దీని లక్ష్యం.

10 ప్రాధాన్యతా రాష్ట్రాలలోని 17,788 గ్రామీణ ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాలకు ఈ మిషన్ తోడ్పాడునందచేస్తుంది. అలాగే అన్ని రాష్ట్రాలలో 11,024 పట్టణ ఆరోగ్య, వెల్‌నెస్ సెంటర్లను ఈ మిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రారంభించడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  హర్షం వ్యక్తం చేశారు. రూ 64 వేల కోట్ల పెద్ద ఆరోగ్య ఇన్ఫ్రా మిషన్ కోసం ప్రధాని కాశీ నుండి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం గొప్ప విషయమ‌ని పేర్కొన్నారు.

మిష‌న్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఏండ్ల దేశాన్ని పాలించిన వాళ్లు హెల్త్ కేర్ రంగాన్ని గాలికి వ‌దిలేశార‌ని ఆరోపించారు. ఇక ప్ర‌ధాని మోదీ త‌న నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో రూ 5200 కోట్లతో చేప‌ట్టిన పలు  అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు.

అమెరికాలోని 100 మిలియన్ల మంది ప్రజల కోసం అధ్యక్షుడు ఒబామా ‘ఒబామా హెల్త్ కేర్ స్కీమ్’ అమలు చేశారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా చెప్పారు. 50 కోట్ల మంది ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది సంపూర్ణ ఆలోచన ఫలితం అని ఆయన పేర్కొన్నారు.

కాగా, యూపీలో  కొత్తగా ప్రారంభింపనున్న 9 వైద్య కళాశాలకు ప్రధాని భూమి పూజ చేశారు.ఈ 9 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో దాదాపు రెండున్నర వేల కొత్త బెడ్‌లు సిద్ధం చేసినట్లు ప్రధాని చెప్పారు. 5 వేల మందికి పైగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ఇక్కడ కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. దీనితో పాటు, ప్రతి సంవత్సరం వందలాది మంది యువతకు వైద్య విద్య యొక్క కొత్త మార్గం తెరుచుకుంటుందని ప్రధాని తెలిపారు. బిజెపి పాలనలో యుపి మెడికల్ హబ్‌గా ఇప్పుడు మారుతోందని ఆయన తెలిపారు.

పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన పేదల ప్రజలకు వైద్య అవసరాలను సమకూర్చడంలో గత ప్రభుత్వం విస్మరించిందని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఇదివరకటి సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వంపై పరోక్షంగా ధ్వజమెత్తారు. కుటుంబ ఖజానాను నింపుకోవడం తప్ప అప్పటి పాలకులు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.

వారి అవినీతి 24 గంటలూ కొనసాగేదని ఆరోపించారు. మందులు, నియామకాలు, బదిలీలు, పోస్టింగులు వంటి అన్ని విషయాల్లో ఆ పరివారానికి చెందిన (అఖిలేష్ యాదవ్ కుటుంబం) వారే అవినీతికి పాల్పడేవారని, వీరి అవినీతి చక్రాల కింద పూర్వాంచల్, యుపిలోని పేద ప్రజలు చితికిపోయారని ప్రధాని విమర్శించారు.