
క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ దొరికిన కేసుకు సంబంధించి బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం రెండో రోజు ప్రశ్నించారు.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో డ్రగ్స్ గురించి చేసిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా ఎన్సీబీ ఆమెను విచారించింది. డ్రగ్స్ కొనుగోలుకు సాయం చేస్తానన్న మెసేజ్ చూపిస్తూ.. ఎక్కడ, ఎలా కొనుగోలు చేశారని అనన్యను అధికారులు ప్రశ్నించారు.
అయితే, ఆ మెసేజ్ ఉట్టిదేనని, ఆర్యన్తో జోక్ చేశానని అనన్య జవాబిచ్చారట. తాను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదని, ఎవరికీ సప్లై చేయలేదని అధికారులకు వివరించిందట. సుమారు 4 గంటలపాటు విచారించి, మళ్లీ సోమవారం రావాలని అనన్యకు సమన్లు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.
గురువారం అనన్య ఇంట్లో సోదాలు చేసి రెండు ఫోన్లు, ల్యాప్ టాప్ను స్వాధీనం చేసుకున్నారు. 2018 – 19లో ఆర్యన్ డ్రగ్స్ కొనేందుకు అనన్య మూడు సార్లు హెల్ప్ చేసిందని, డ్రగ్ డీలర్ల నెంబర్లను వాట్సాప్ చాట్ లో అతనికి షేర్ చేసిందని ఎన్సీబీ వర్గాలు చెప్తున్నాయి.
More Stories
భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
దేశంలో ర్యాగింగ్ మరణాల సంఖ్య 2020- 2024లో 51
ఈ నెల 29న సూర్యగ్రహణం