హిందువుల మనోభావాలు దెబ్బతీసిన అమీర్ ఖాన్‌

బాలీవుడ్ మెగాస్టార్ అమీర్ ఖాన్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమీర్ ఖాన్ సియట్ లిమిటెడ్ ప్రచార ప్రకటనలో ఇటీవల నటించారు. దీపావళి పండుగ సందర్భంగా రోడ్లపై క్రాకర్స్ కాల్చవద్దంటూ అమీర్ ఖాన్ టైర్ల తయారీ దిగ్గజం సియట్ లిమిటెడ్ వాణిజ్య ప్రకటనలో అమీర్ ఖాన్ కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. 

ఈ వాణిజ్య ప్రకటనలో అమీర్ ఖాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అనంతకుమార్ ఆరోపించారు. సియట్ ప్రకటనలో అమీర్ ఖాన్ చేసిన ప్రకటన హిందువుల్లో అశాంతి సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. 

సియట్ కంపెనీ హిందువుల సెంటిమెంటును గౌరవిస్తుందని ఆశిస్తున్నానని అనంతకుమార్ సియట్ ఎండీ, సీఈవో వర్ధన్ గోయెంకాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ ప్రకటనను వెంటననే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 ‘‘మీ కంపెనీ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో అమీర్ ఖాన్ ప్రజలకు వీధుల్లో క్రాకర్స్ కాల్చవద్దని సలహా ఇచ్చాడు, ఇది చాలా మంచి సందేశాన్ని ఇస్తోంది. ప్రజా సమస్యలపై మీ ఆందోళనకు ప్రశంసలు తెలుపుతున్నాను” అని ఆ లేఖలో తెలిపారు.

అయితే  ఈ విషయంలో రోడ్లపై ప్రజలు ఎదుర్కొంటున్న మరో సమస్యను పరిష్కరించాలని ఆయన ఆ లేఖలో అభ్యర్ధించారు.  శుక్రవారం నమాజ్ పేరిట రోడ్లు బ్లాక్ చేయడంను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అజాన్ పేరిట ముస్లిములు మసీదుల నుంచి శబ్ధ కాలుష్యాన్ని వెదజల్లుతున్నారని  అని అనంతకుమార్ ఆరోపించారు. కొందరు బాలీవుడ్ నటులు ఎల్లప్పుడూ హిందువుల మనోభావాలను గాయపరుస్తూ వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వారెప్పుడు తమ మతంలోని లోపాలను మాత్రం ప్రస్తావించారని ఎద్దేవా చేశారు.