
డబ్బులతో రాజకీయాలను శాసించాలనుకునే కేసీఆర్ దుష్ట రాజకీయాలను బొంద పెట్టాలి’ అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పిలుపిచ్చారు. జమ్మికుంటలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఓట్ల కోసం ఇంటింటికీ మటన్, మద్యం పంపించే దౌర్భాగ్యం ఎక్కడా చూడలేదని చెప్పారు.
‘నన్ను కాపాడండి.. మిమ్మల్ని గుండెలో పెట్టుకొని కాపాడుకుంటా. ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తా’ అని భరోసా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రం అరిగోస పడుతోందని ధ్వజమెత్తారు.
‘యావత్తు భారతదేశ చరిత్రలోనే ఒక నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసే స్థాయి ఉంటుందా అని అడిగారు. ప్రజల గొంతుకగా ప్రశ్నించే తనను రాజకీయంగా ఖతం చేయడానికే కుట్రలు పన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఈటల ఆరోపించారు.
ఎవరు అక్రమాలు చేశారు, దుర్మర్గాలు చేశారు, అక్రమంగా సంపాదించారు, ముందు ముందు సమాజం తెలుస్తుందని పేర్కొన్నారు. హుజూరాబాద్ విష వలయంలో చిక్కుకుందని, మానవ సంభందాలను ప్రశ్నిస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థ ఎటో పోతుందని, గాడిన పెట్టాల్సింది మనమే అని స్పష్టం చేశారు.
ప్రజల అవసరాల కోసం పని చేశాను తప్ప, తనఅవసరాల కోసం ఎప్పుడు పని చేయలేదని రాజేందర్ తెలిపారు. ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ఎన్నికకు కూడ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని చెప్పారు. చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతా అని, ఎట్టి పరిస్థితుల్లో మోకరిల్లను అని హామీ ఇచ్చారు.
“నేను వ్యవస్థతో కొట్లాడుతున్న, వాళ్లది అక్రమ సాంపాదన, వేల కోట్ల రూపాయాలు జమ చేసుకోని ఇష్టం వస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు” అని తెలిపారు.
More Stories
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి