మందాపూర్ లో దసరా ఉత్సవంపై దాడి

Representational Image

కామారెడ్డి జిల్లా బీబీపెట్ మండలం మందాపూర్ లో దసరా ఉత్సవంలో భాగంగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువకులపై అదే గ్రామానికి చెందిని కొందరు దుండగులు అడ్డుకొని నిర్వాహకులపై దాడి చేసి భీభత్సం సృష్టించారు.

15 అక్టోబర్ నాడు మందాపూర్ గ్రామంలోని భవానీ యూత్ సంస్థ అద్వర్యంలో హిందువులు రావణ దహన కార్యక్రమం  నిర్వహిస్తుంటె అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన  కొంతమంది దుండగులు నిర్వాహకులపై  దుర్భాషలడుతూ  రాళ్ళు విసిరారు.   ఈ ఘర్షణలో సాయిరెడ్డి అనే యువకునికి తలకు తీవ్ర గాయాలు అయినాయి.

దీనికి సంబంధించి ఇరు వర్గాల వారు స్థానికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.  స్థానికుల కథనం ప్రకారం  గ్రామంలోని క్రైస్తవాన్నిఆచరిస్తున్న  కొంతమంది హిందూ ఆచార వ్యవహారాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని. రావణ దహనం పై ఒక ప్రణాళిక ప్రకారమే దాడి చేసారని ఆరోపించారు.

భవానీ యూత్ వారు  రావణ దహన కార్యక్రమంపై  దాడికి సూత్రదారులుగా ద్యాగల వెంకటి, ద్యాగల రాజులపై వీరికి సహకరించినట్టు రొడ్డ రాజు, బొంద రాజ్ కుమార్, బొంద సంతోష్ తదితర 25మందిపై  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో వర్గం సైతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులతో గ్రామం ఉద్రిక్తంగా ఉంది. దుర్గామాత నిమజ్జనం పై ఉద్విగ్నత నెలకొంది.