ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అవినీతి గురించి వీడియో సాక్షిగా చర్చించుకొంటూ ఇద్దరు కర్ణాటక కాంగ్రెస్ నేతలు చిక్కారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీనిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కో-ఆర్డినేటర్ సలీమ్ అహ్మద్ మాట్లాడుకుంటూ కనిపించారు. శివకుమార్, అతని అనుచరుడు ముల్గుంద్ తీసుకుంటున్న లంచాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.
గతంలో 6-8 శాతం మాత్రమే తీసుకునే వాళ్లమని, కానీ కొత్తగా ‘డీకే అడ్జస్ట్‌మెంట్’తో అది 12 శాతానికి పెరిగిందని సలీమ్ అహ్మద్ అనడం వినిపిస్తోంది. అలాగే శివకుమార్ సహచరుడైన ముల్గుంద్ 50-100 కోట్ల రూపాయలు సంపాదిస్తే. శివకుమార్ ఎంత సంపాదించి ఉంటాడని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అలాగే శివకుమార్ మాట్లాడే సమయంలో తాగిన వాడిలో తడబడతాడని జోకులేసుకున్నారు. ఆపై డీకేను పార్టీ అధ్యక్షుడిని చేయడం కోసం కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, కానీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మాత్రం పార్టీని, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఉగ్రప్ప విమర్శించారు.
ఈ వీడియో వైరల్ అవడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన కాంగ్రెస్.. సలీమ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఉగ్రప్పకు షోకాజ్ నోటీసులు పంపింది. ఈ వీడియోను బీజేపీ నేతలు కూడా షేర్ చేశారు. బీజేపీ జాతీయ సమాచార, సాంకేతిక విభాగం ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ఇంట్రస్టింగ్’ అంటూ కామెంట్ చేశారు.
More Stories
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్‌లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు