భారతదేశంలో తయారవుతున్న రష్యన్ స్పుత్నిక్ లైట్ కరోనా టీకాలను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్పుత్నిక్ లైట్ టీకాలను భారతదేశంలో అత్యవసర వినియోగానికి ఇంకా ఆమోదించలేదు. దాంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రష్యాకు 40 లక్షల డోసుల స్పుత్నిక్ లైట్‌ను ఎగుమతి చేయడానికి భారత్‌కు చెందిన ఔషధ సంస్థ హెటెరో బయోఫార్మా లిమిటెడ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. స్పుత్నిక్ లైట్ అనేది రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ V కాంపోనెంట్-1 వలె ఉంటుంది. ఇది ఏప్రిల్‌లో భారతదేశం ఔషధ నియంత్రణ విభాగం నుంచి అత్యవసర వినియోగ అధికారాన్ని పొందింది.
దాంతో భారతదేశంలోని యాంటీ-కోవిడ్ టీకాల్లో ఈ టీకాను కూడా చేర్చారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) భాగస్వాములలో ఒకరైన హెటెరో బయోఫార్మా ఉత్పత్తి చేసే స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌కు ఇక్కడ అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చే వరకు తమ దేశానికి ఎగుమతి చేయడానికి అనుమతించాలని రష్యన్ రాయబారి భారత ఔషధ నియంత్రణ కార్యాలయం ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరారు.
స్పుత్నిక్ వి మిలియన్ డోసులు, స్పుత్నిక్ లైట్ రెండు మిలియన్ డోసులను హెటెరో బయోఫార్మా సంస్థ ఇప్పటికే ఉత్పత్తి చేసిందని కేంద్రానికి పంపిన లేఖలో రష్యన్ రాయబారి నికొలయ్ కుడాషెవ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఆరు నెలల షెల్ఫ్ జీవితం త్వరలో ముగుస్తున్నదని, రిజిస్ట్రేషన్‌కు మందు టీకా మోతాదులు వృధా అవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
2020 డిసెంబర్ 5 నుంచి 2021 ఏప్రిల్ 15 వరకు రష్యా సామూహిక టీకా డ్రైవ్‌లో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ 79.4 శాతం సమర్ధత చూపించినట్టు. అనేక డబుల్ డోసు వ్యాక్సిన్లు కన్నా సమర్ధత స్థాయి 80 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ప్రయోగశాల పరీక్షల్లో ఈ వ్యాక్సిన్ కొత్త వేరియంట్లను కూడా నియంత్రించ గలదని తేలింది.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం