కరొనతో తగ్గిన రెండేళ్ల ఆయుర్దాయం

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉండగా, వారి సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతున్నట్లు తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఒక వ్యక్తి సగటు ఆయుర్దాయం రెండేళ్ల పాటు తగ్గిపోతున్నదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువ ఆయుర్దాయం క్షీణించడం ఇదే.ఐరోపా దేశాలు, అమెరికా, చిలీతో పాటు 29 దేశాలకు గాను 27 దేశాలతో 2019 తో పోలిస్తే ఇప్పుడు ఆయుర్దాయం తగ్గిందని పరిశోధనలో తేలింది.చాలామంది అమెరికన్ పురుషుల ఆయుర్దాయం 2.2 సంవత్సరాలకు పైగా తగ్గినట్లు గుర్తించారు.

‘పరిశోధన ప్రకారం చాలా దేశాల్లో మహిళల కంటే పురుషుల ఆయుర్దాయం మరింత క్షీణించింది. 15 దేశాల్లో పురుషుల ఆయుర్దాయం ఏడాదికి పైగా తగ్గింది. 11 దేశాల్లో మహిళల ఆయుర్దాయం తగ్గుదల గమనించారు’ అని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించబడిన రీసెర్చ్ పేపర్ కో-హెడ్, రచయిత డాక్టర్ రిద్ధి కశ్యప్ తెలిపారు. ఇప్పటి

మరోవంక, కరోనా కారక వైరస్ ఇప్పుడిప్పుడే మానవాళిని వదలబోదని, దీర్ఘకాలం పాటు ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింప చేస్తూనే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వొ ) సీనియర్ అధికారి పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. కొంతకాలానికి మహమ్మారి నుంచి ఎండెమిక్ స్థాయికి దిగివస్తుందా అన్నది టీకాలు, మునుపటి ఇన్‌ఫెక్షన్ ద్వారా సమాజంలో ఉత్పన్నమయ్యే రోగనిరోధకతపై ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పారు. 

ఈ రక్షణను అధికంగా కలిగి ఉన్న చోట భవిష్యత్‌లో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతూ  వైరస్‌పై పూర్తి పట్టు సాధించే పరిస్థితి ఉండాలని సూచించారు. వరకు, ప్రపంచవ్యాప్తంగా 47 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా కారణంగా మరణించారు.

కాగా,  సమాజంలో గరిష్ఠ స్థాయిలో కరోనా వ్యాప్తిని గుర్తించడానికి మొత్తం ఏడు లక్షణాల జాబితాను పరిశోధకులు గుర్తించారు. ఈమేరకు పరిశోధన వివరాలు ది జర్నల్ ప్లాస్ మెడిసిన్‌లో వెలువడ్డాయి. వాసన లేక పోవడం లేదా మారడం, రుచి మారడం లేదా రుచించక పోవడం, జ్వరం, పొడిదగ్గు కొనసాగడం, చలి, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు, ఇవన్నీ ఉమ్మడి లక్షణాలుగా పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.