కేటీఆర్ వల్లే ఐటీ పరిశ్రమలు పోతున్నయ్

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి కారణంగానే  తెలంగాణాలో ఉండలేమని హైదరబాద్ నుంచి చాలా ఐటి సంస్థలు వెళ్ళిపోతున్నాయని బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు విమర్శించారు. “నేను  చెప్పేది తప్పయితే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు ను నేలకు రాస్తా…కేటీఆర్ చర్చకు సిద్ధమా” .అని ఆయన సవాల్ విసిరారు. 

వందలాది ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి వెళ్లి పోతున్నయో లేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటిఆర్ ఐటీ కంపెనీ లపై అబద్ధాలు చెప్పిండని పేర్కొంటూ అబద్ధాలు ఆడడంలో కేటీఆర్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌తో చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. 

2007లో వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మెదక్ జిల్లా తెల్లాపూర్ లో ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు టిష్  మెన్ స్పెయార్ అనే ఐటీ కంపెనీ  400 ఎకరాలను వేలం పాటలో రూ 1686 కోట్లకు దక్కించుకుందని, అడ్వాన్స్ కింద రూ 400 కోట్లు కూడా చెల్లించిందని తెలిపారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని రోజులు ఆగిన తర్వాత 2014 లో కేసీఆర్ ను కలిసి మెదక్ జిల్లా తెల్లాపూర్  400 ఎకరాల గురించి దరఖాస్తు చేసుకుందని పేర్కొన్నారు. పరిశీలిస్తామని చెప్పిన కేసీఆర్ పట్టించుకోకపోవడంతో 2014 నుంచి తిరిగి తిరిగి 2021లో తెలంగాణ నుంచి ఆ ఐటీ కంపెనీ వెళ్లిపోయిందని బిజెపి ఎమ్యెల్యే తెలిపారు. ఇది నిజామో కాదో కేటీఆర్ చెప్పాలని సవాల్ చేశారు. 

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు..న్యూ యార్క్ నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చిన టిష్ మెన్ స్పెయార్ ను  తండ్రి, కొడుకులు పట్టించుకోలేదని రఘునందనరావు విమర్శించారు. వీరిద్దరి నిర్వాకం కారణంగా చాలా కంపెనీలు హైదరాబాద్ నుండి ఆయన ఆరోపించారు. న్యాయపర సమస్యలున్న భూములను ఐటి కంపెనీలకు చుపిస్తున్నారని చెప్పారు.  

లీగల్ సమస్యలు ఉన్నాయని, హైదరాబాద్ వరెస్ట్ సిటీ అని ఐటీ కంపెనీ లు వెళ్లిపోతున్నాయని బిజెపి నేత ఆరోపించారు. ఐదేండ్లయినా భూమి  సమస్య పరిష్కారం కాకపోవడంతో డిఎల్ఎఫ్ కూడ వెళ్ళిపోయిందని ఆయన చెప్పారు. ఇది వాస్తవమా కాదా అనేది కేటీఆర్ చెప్పాలని నిలదీశారు. భూ రికార్డుల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని ధ్వజమెత్తారు. 

ఉప్పల్, రామంతపూర్ ఐటీ  కంపెనీల వైపు కేటీఆర్ ఎందుకు వెళ్ళడం లేదు.? అని రఘునందనరావు ప్రశ్నించారు.  కొంపల్లి లో ఐటీ పార్క్ పెడతాం అంటే కూడా అనుమతులు ఇవ్వటం లేదని తెలిపారు. జిల్లాల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. వరంగల్, కరీంనగర్ లో ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారో కేటీఆర్ చెప్పాలి? అని రఘునందనరావు ప్రశ్నించారు.