సివిల్స్ లో తెలుగు అమ్మాయికి 20వ ర్యాంక్

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన సివిల్స్ -2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి)  విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 ఒబిసి, 122 ఎస్‌సి, 61 ఎస్‌టి, 86 మంది ఇడబ్య్లూఎస్ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు.
 
తెలుగు రాష్ట్రాల నుండి 30 మందికి పైగా ఎన్నికయ్యారు. వరంగల్‌కు చెందిన పి.శ్రీజ జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు సాధించారు.నలుగురు అభ్యర్థులు 100 లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థులు పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్ 84వ ర్యాంకు, యశ్వంత్ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు పొందారు. 
 
తెలుగు రాష్ట్రాల నుండి ఇతర ర్యాంకులు పొందినవారిలో బి.చంద్రకాంత్‌ రెడ్డి (120), లక్ష్మీ సౌజన్య (127), రాళ్లపల్లి వసంత్‌కుమార్‌ (170), గొబ్బిళ్ల విద్యాధరి (211), అనిరుధ్‌ ఆర్‌ గంగవరం (252), పి.గౌతమి (317), కె.సౌమిత్‌రాజ్‌ (355), చిలుముల రజనీకాంత్‌ (364), శేషాద్రిని రెడ్డి (401), జి.తిరపతిరావు (441), ఎస్‌.ప్రశాంత్‌ (498), పృథ్వీరాజ్‌ (541), ఎ.అభిషేక్‌ (616), కోట కిరణ్‌కుమార్‌ (652),  దోనేపూడి విజయకుమార్‌ (682), ఇ.వేగిని (686), కె.శ్రీకాంత్‌ రెడ్డి (747) తదితరులు ఉన్నారు.
 
ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆడుతూ పాడుతూ సివిల్స్‌ పరీక్షలకు ప్రిపేరయినట్టు వరంగల్‌కు చెందిన పి. శ్రీజ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చిలుకానగర్‌లో ఉంటున్నారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో  మెడిసిన్‌ చదివిన శ్రీజ మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించారు. 
 
అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల్లో సమాధానాలు బాగా రాశానని తెలిపారు. ఇంటర్వ్యూలో ఎలాంటి తడబాటు లేకుండా, ఒత్తిడికి గురికాకుండా జవాబులు చెప్పానని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన సోదరులు జగత్‌ సాయి (32వ ర్యాంకు), వసంత్‌కుమార్‌ (170వ ర్యాంకు) ఒకేసారి సివిల్స్‌కు ఎంపికయ్యారు.
కాగా, బాంబే ఐఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన శుభం కుమార్‌ జాతీయ స్థాయిలో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచారు. భోపాల్‌లోని ఎన్‌ఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన జాగృతి అవస్థీ రెండో ర్యాంకు సాధించారు. ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివిన అంకితా జైన్‌కు మూడో ర్యాంకు లభించింది. సివిల్స్‌ 2016లో టాపర్‌గా నిలిచిన టీనా డాబీ చెల్లెలు రియా డాబీ తాజా ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించారు.
జగన్ ప్రభుత్వ అవినీతి బహిర్గతం 
 
వై ఎస్ జగన్ మోహన్ రెడీ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎంతగా అవినీతిమయం అయిందో ఈ ఫలితాలు వెల్లడించాయి. గ్రూప్ 1 ఉద్యోగాలను అధికార పార్టీకి చెందినవారు వేలంపాటలో అమ్మిన్నట్లు అమ్మారని వచ్చిన ఆరోపణలు నిజమే అన్నట్లు నిరూపించాయి. 
 
ఈ ఉద్యోగుల ఎంపికలో అవినీతి జరిగినదని, అందుకనే తమను ఎంపిక చేయలేదని ఆరోపిస్తూ రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించిన ఆరుగురు అభ్యర్థులు సివిల్స్ కు ఎంపికయ్యారు. ఎపిపిఏసిలో అవినీతి కారణంగా ఎంపిక కాలేక పోయిన జగత్ సాయి సివిల్స్ లో 32వ ర్యాంక్ పొందారు. 
అదే విధంగా యాశ్వంత్ 93వ ర్యాంక్, వసంత్ కుమార్ 170 ర్యాంక్, సంజనా సింహ 207వ ర్యాంక్, బయ్యపు రెడ్డి 604వ ర్యాంక్,  సాహిత్య 647వ ర్యాంక్ పొందారు.  
 
డిజిటల్ మూల్యాంకనం పేరుతో కావాల్సిన వారికి అధికార పార్టీ వారు ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపిస్తూ వీరంతా ఎపిపిఎస్సి ఎంపికలను సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. 
 ఉద్యోగాలు అమ్ముకున్నారు అని కోర్టులో కేసు వేసిన వారే.