రేషన్‌‌ షాపుల్లో తక్కువ ధరలకే చిరుధాన్యాలు!

రేషన్‌‌ షాపుల్లో తక్కువ ధరలకే చిరుధాన్యాలు!

ప్రజలకు పౌష్టికాహారం అందజేసేందుకు మిల్లెట్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ చేపట్టామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌‌‌‌‌‌‌‌ తోమర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో రెండు రోజుల పాటు నిర్వహించే మిల్లెట్స్‌‌‌‌‌‌‌‌ మెగా కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. 

వివిధ ప్రాంతాల ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరకే చిరుధాన్యాలను  అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అందరి ఆహారంలో వీటిని భాగం చేస్తామని పేర్కొన్నారు.

తృణధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ఫుడ్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ పరిశ్రమల్లో చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇచ్చి విదేశాలకు ఎగుమతి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ ఇప్పటికే క్రియాశీల పాత్ర పోషిస్తున్నదని, 2023 నాటికి మన దేశం మొత్తంతో పాటు ప్రపంచానికి కూడా అందించేందుకు కృషిచేస్తామని తోమర్‌ చెప్పారు. 

ప్రధాని నరేంద్ర మోదీ చొరవతతో ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని మిల్లెట్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. చిన్న కమతాలున్న రైతులను సంఘటితం చేసేందుకు రూ.6,850 కోట్లు ఖర్చు చేసి కొత్తగా10 వేల ఫార్మర్‌‌‌‌‌‌‌‌ ప్రొడ్యూసర్స్‌‌‌‌‌‌‌‌ ఆర్గనేజేషన్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

వ్యవసాయ రంగంలో ఉన్న లోటుపాట్ల పరిష్కారం, మౌలిక సదుపాయాలు కల్పనకు  కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి తెలిపారు. పాడి పరిశ్రమకు రూ.15 వేల కోట్లు, ఫిషరీష్‌‌‌‌‌‌‌‌కు రూ.20 వేల కోట్లు, ఔషధ మొక్కల కోసం రూ.4 వేల కోట్లు, రూ. 10 వేల కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్, రూ.5 వేల కోట్లు తేనెటీగల పెంపకానికి  కేటాయించామని వివరించారు. 

అనుకూల వాతావరణం, భూములు ఉన్నందున తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలని కేంద్ర మంత్రి కోరారు. కాగా, రికార్డు స్థాయిలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ చేపడుతున్న నేపథ్యంలో.. విత్తనాలకు కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కోరారు.