అభివృద్ధి పధంలో ముందంజలో యుపి… ప్రధాని ప్రశంస

అభివృద్ధి ప్రచారంలో ఉత్తరప్రదేశ్ దేశంలో ముందుందని ఉందని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అలీఘర్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేస్తూ రాష్ట్రం, కేంద్రంలోని  డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నుండి ఉత్త”ర ప్రదేశ్ ఎంతో ప్రయోజనం పొందుతోందని చెప్పారు.

ఇంతకు ముందు యూపీని భారతదేశ అభివృద్ధికి అడ్డంకిగా పరిగణించేవారని, కానీ నేడు రాష్ట్రంలో డజన్ల కొద్దీ ప్రాజెక్టుల కారణంగా, యుపి తన ఇమేజ్‌ని పూర్తిగా మార్చుకుందని, పైగా నేడు భారతదేశ అభివృద్ధికి ఆజ్యం పోస్తోందని ప్రధాని కొనియాడారు. “యుపి తన గుండ-రాజ్, మాఫియా-రాజ్, గ్యాంగ్‌స్టర్‌ల స్వేచ్ఛా రన్ కోసం అపఖ్యాతి పాలైన సమయం ఉంది, కానీ యోగి ప్రభుత్వంలో ఇవన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. గ్యాంగ్‌స్టర్‌లు, మాఫియాలు,  గుండాలను బైటకు రాకుండా చేశారు” అంటూ ప్రధాని అభినందించారు . 

గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సాంఘిక సంస్కర్త రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ జ్ఞాపకార్థం ఈ విశ్వవిద్యాలయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్థాపిస్తోంది. దీనిని   లోథా, ముసేపూర్ కరీమ్ జరౌలి గ్రామాల్లోని మొత్తం 92 ఎకరాల్లో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నారు. యూనివర్సిటీ అలీగఢ్ డివిజన్‌లోని 395 కాలేజీలకు అనుబంధాన్ని అందిస్తుంది.

జీవితంలో గొప్ప ల‌క్ష్యాల‌ను సాధించాల‌నుకుంటున్న యువ‌కులంతా రాజా మ‌హేంద్ర ప్ర‌తాప్ సింగ్ జీవితాన్ని అధ్య‌యం చేయాల‌ని మోదీ సూచించారు. ర‌క్ష‌ణ రంగ ఉత్ప‌త్తుల‌ను దిగుమ‌తి చేసే ఇమేజ్ నుంచిభారత్  బ‌య‌ట‌ప‌డుతోంద‌ని ఆయన చెప్పారు. ప్ర‌పంచ దేశాల‌కు ఇప్పుడు ర‌క్ష‌ణ రంగ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేసే స్థాయికి భారత్ చేరిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ఆధునిక విద్య‌కు ప్ర‌తాప్ సింగ్ వ‌ర్సిటీ కేంద్రంగా మారుతుంద‌ని, ఆ వ‌ర్సిటీలో ర‌క్ష‌ణ సంబంధింత అంశాలు, ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల త‌యారీ టెక్నాల‌జీ గురించి స్ట‌డీ చేయ‌నున్నార‌ని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ ఆనందీబెన్‌, సీఎం యోగి పాల్గొన్నారు. వ‌చ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో అలీఘ‌డ్‌లో మోదీ ప‌ర్య‌ట‌న కీల‌కం కానున్న‌ది.

కాగా, ఈ సంద‌ర్భంగా యూపీ డిఫెన్స్ ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్‌కు చెందిన ఉత్ప‌త్తుల ఎగ్జిబిష‌న్‌ను ప్రధాని తిల‌కించారు. ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 21న లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమ్మట్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు  ప్రకటించారు. అలీగఢ్, ఆగ్రా, కాన్పూర్, చిత్రకూట్, ఝాన్సీ, లక్నోలను ఈ కారిడార్ కలుపుతుంది.

అలీగఢ్ నోడ్‌లో భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. 19 సంస్థలకు భూముల కేటాయింపు జరిగింది. ఆ సంస్థలు రూ.12245 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించడానికి, మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడుతుంది.