భారత్ సరిహద్దుల్లో కమాండర్లను మార్చిన చైనా, పాక్ 

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడంతో, పాకిస్తాన్,  చైనా భారతదేశంతో సరిహద్దులను పర్యవేక్షిస్తున్న తమ సైనిక కమాండర్‌లను అర్ధాంతరంగా మార్చాయి, ఉత్తర, పశ్చిమ సరిహద్దులలో అకస్మాత్తుగా రక్షణను పొరుగు దేశాలు మార్చడంతో భారత సేనలు కూడా తమ క్లిష్టమైన సరిహద్దులకు సంబంధించిన వ్యూహాన్ని చక్కదిద్దుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

పాకిస్తాన్ సైన్యం మంగళవారం తన సరిహద్దులో నియంత్రణ రేఖ భద్రతకు బాధ్యత వహిస్తున్న రావల్పిండికి చెందిన 10 కార్ప్స్‌కు కొత్త కమాండర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను కమాండర్‌గా నియమించగా, రావల్పిండి కార్ప్స్, లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ చిరాగ్ హైదర్‌కు ముల్తాన్ కార్ప్స్ బాధ్యత అప్పగించబడింది, ఇది పాకిస్తాన్ ఆర్మీ  ప్రధాన పోరాట దళాలలో ఒకటి.

పాకిస్తాన్ శక్తివంతమైన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ ఆఫ్ఘనిస్తాన్‌లోని కొత్త తాలిబాన్ ప్రభుత్వంలో తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు, ఉప ప్రధాన మంత్రి ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్‌తో సమావేశమైన కొద్ది రోజుల తర్వాత పాకిస్థాన్ సైన్యంలో పునర్విభజన జరిగింది. భారత్, పాక్ సైన్యం సరిహద్దుల్లో గత ఫిబ్రవరి నుండి కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నాయి. 

మరోవంక, చైనా భారతదేశంతో సరిహద్దులను పర్యవేక్షించే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ కొత్త కమాండర్‌గా జెన్ వాంగ్ హైజియాంగ్‌ను నియమించింది. అతను గత పది నెలల్లో వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కి నాయకత్వం వహించిన నాల్గవ కమాండర్. జూలైలో మాత్రమే పదోన్నతి పొందిన జు ఖైలింగ్ స్థానంలో జెన్ హైజియాంగ్ వచ్చారు. 

చైనా సైన్యంకు మొత్తంపై ఆధిపత్యం వహించే సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సిఎంసి) కి నాయకత్వం వహిస్తున్న చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్,  ఈ ఏడాది జూలైలో టిబెట్‌ను సందర్శించడం గమనార్హం.  పీఎల్ఎ అతిపెద్ద థియేటర్ కమాండ్ అయిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో పదేపదే గార్డును మార్చడం, చైనా-భారత సరిహద్దు పరిస్థితిని ఎదుర్కోవడంపై చైనా నాయకత్వం  అసంతృప్తిని ప్రతిబింబిస్తుందని చైనా మిలిటరీ పరిశీలకులు పరిశీలిస్తున్నారు.

జిన్‌పింగ్   మంగళవారం, సెంట్రల్ థియేటర్ కమాండ్ కమాండర్ లిన్ జియాంగ్యాంగ్,  ఎయిర్ ఫోర్స్ కమాండర్ డాంగ్ జున్, జాతీయ డిఫెన్స్ యూనివర్సిటీ అధ్యక్షుడు జు జుక్వియాంగ్ లతో సహా ఐదుగురు అధికారులకు పదోన్నతి కల్పించారు. తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద భూభాగంలో భారత్, చైనా సేనల మధ్య గత ఏడాదికిపైగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రెండు దేశాల సేనలు, దౌత్య వర్గాల మధ్య మధ్య పలు రౌండ్ల చర్చలు జరిగినా  ఇంకా పరిష్కారం కాలేదు.

జూలై 31 న జరిగిన చివరి మిలిటరీ కమాండర్ చర్చలో, ఇరువైపులా పెట్రోలింగ్ పాయింట్ 17 ఎ. గోగ్రా ప్రాంతం నుండి విడదీయడానికి అంగీకరించారు. కానీ డెప్‌సాంగ్,  డెమ్‌చోక్ ఫ్లాష్‌పాయింట్లపై ఇంకా పరిష్కారం కుదరలేదు.

“దక్షిణ ఆసియాలోని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్, అల్-ఖైదా భారతదేశాన్ని ప్రధాన లక్ష్యంగా భావిస్తారు. మాకు అనుభవం ఉంది. తాలిబాన్ అధికారంలో ఉన్నప్పుడు, అన్ని ఉగ్రవాద గ్రూపులు వారి ఆధ్వర్యంలో గతంలో అభివృద్ధి చెందాయి” అని భరత్ రక్షణ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

“తాలిబాన్ పెరుగుదల భారతదేశానికి ఎటువంటి ప్రాదేశిక ముప్పును కలిగించదు, కానీ తీవ్రవాద స్వరాల ద్వారా ప్రోత్సహించబడే,  తోడేలు యోధుల దాడులను ప్రోత్సహించే మౌలికవాద అంశాల నుండి సైద్ధాంతిక ముప్పు పొంచి ఉంది” అని యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ఇన్‌స్ట్రక్టర్,  వ్యూహాత్మక, భద్రతా విశ్లేషకుడుమేజర్ జనరల్ (రిటైర్డ్) శశి ఆస్థానా హెచ్చరించారు.