న్యూజిలాండ్‌లోఉగ్రదాడి… ఆరుగురిని పొడిచిన ఐసిస్ ఉన్మాది

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత ఉగ్రవాది ఒకడు న్యూజిలాండ్ సూపర్ మార్కెట్లో బీభత్సం సృష్టించాడు. శుక్రవారం ఉదయం ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి, విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆరుగురు సామాన్యులు తీవ్రంగా గాయపడ్డారు. 

అప్పటికే ఈ ఉగ్రవాదిని పట్టుకోవడానికి నిఘా పెట్టిన పోలీసులు ఆ ఉగ్రవాదిని కాల్చి చంపేశారు. ఈ వివరాలను న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసింద ఆర్డెర్న్ వెల్లడించారు. శ్రీలంకకు చెందిన‌ ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్ర‌వాది ఈ దాడికి పాల్పడిన‌ట్లు ఆమె చెప్పారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

 క‌త్తిదాడి జ‌రిగిన 60 సెక‌న్ల లోపే ఆ ఉన్మాదిని హ‌త‌మార్చిన‌ట్లు ప్ర‌ధాని జెసిండా తెలిపారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి 2011లో న్యూజిలాండ్‌కు వ‌చ్చాడ‌ని, 2016 నుంచి అత‌నిపై జాతీయ భ‌ద్ర‌తా ద‌ళం నిఘా పెట్టిన‌ట్లు ఆమె చెప్పారు. ఆ ఉన్మాది భావ‌జాలం విప‌రీతంగా ఉన్న నేప‌థ్యంలో అత‌నిపై నిఘా పెట్టిన‌ట్లు జెసిండా తెలిపారు.

‘‘ఈ రోజు జరిగినది చాలా హేయమైన సంఘటన. ఇది విద్వేషపూరితం, చాలా తప్పు’’ అని ప్రధాన మంత్రి జసింద చెప్పారు. ఇది ఏ మతానికి, విశ్వాసానికి ప్రాతినిధ్యం వహించబోదని స్పష్టం చేశారు. ఇది చాలా హింసాత్మక భావజాలమని చెప్పారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రేరణతో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. 

ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉన్మాది సూప‌ర్‌మార్కెట్‌లో క‌త్తితో బీభ‌త్సం సృష్టించిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ప్ర‌జ‌లు ఆ మార్కెట్ నుంచి అటూ ఇటూ ప‌రుగులు తీశార‌న్నారు. అరుపులు, కేక‌లు పెట్టార‌న్నారు. ఓ వ్య‌క్తి క‌త్తిపోట్ల‌తో కింద‌ప‌డిపోయిన‌ట్లు ఒక‌రు తెలిపారు. న్యూ లిన్ ప్రాంతంలో ఉన్న లిన్‌మాల్ నుంచి జ‌నం భ‌యంతో ప‌రుగులు తీస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యాయి.

ఆరుగుర్ని హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్ల‌గా, దాంట్లో ముగ్గురు క్రిటిక‌ల్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలు చెప్పనప్పటికీ, అతని గురించి  వ్యక్తిగతంగా దాడికి ముందు తెలుసని ప్రధాని చెప్పారు. కరోనావైరస్ కేసుల కారణంగా ఆక్లాండ్ ఇప్పటికే లెవల్ 4 లాక్‌డౌన్‌లో ఉంది, దేశంలో అత్యంత కఠినమైన స్థాయి – అంటే చాలా దుకాణాలను మూసివేశారు. చాలా మంది ప్రజలు ఇంట్లోనే ఉన్నారు. సూపర్‌మార్కెట్లను అత్యవసర సేవగా తెరిచి ఉంటాయి.

ఈ దాడితో సూపర్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయిన్నట్లు యజమాన్యం తెలిపింది. “మా బృందం, వినియోగదారులు ఏమి చూశారో,  దానితో ఎటువంటి భయానక పరిస్థితి ఎదుర్కొన్నారో తెలుసుకుంటే మా హృదయాలు భారంగా ఉన్నాయి” అని ఓ ప్రకటనలో  పేర్కొంది. మార్చి 15, 2019 న క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల వద్ద శ్వేతజాతీయుల ముష్కరుడు 51 మందిని చంపినప్పటి నుండి న్యూజిలాండ్ ఉగ్రదాడుల పట్ల అప్రమత్తంగా ఉంటూ వస్తున్నది.