టోక్యోలో నిషాద్ రజితం, వినోద్ కాంస్యం

 జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లోభారత క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. ఆదివారం ఉదయం టీటీలో భవీనా పటేల్‌ రజత పతాకం గెలుపొందగా, తర్వాత హైజంప్‌లో నిషాద్‌ కుమార్‌ మరో రజితపతాకం సాధించారు. పురుషుల డిస్కస్ త్రో లో వినోద్ కుమార్ కాంస్య పథకం గెల్చుకున్నారు. 
భారత క్రీడాకారుడు నిషాద్ కుమార్ హైజంప్‌లో రజత పతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఫలితంగా ఐదో రోజైన నేడు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి.  పురుషల హై జంప్‌లో అమెరికా అథ్లెట్ టౌన్‌సెండ్ రోడెరిక్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకోగా, రెండో స్థానంలో నిలిచిన నిషాద్‌కు రజతం దక్కింది. 
 
ఈ రోజు ఉదయం టేబుల్ టెన్నిస్‌లో భారత క్రీడాకారిణి భవీనా పటేల్ రజతం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించింది. నిషాద్ సహచరుడు రామ్ పాల్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫైన‌ల్లో త‌న అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న అయిన 2.06 మీట‌ర్ల ఎత్తు దూకిన నిషాద్‌.. ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మైనా.. రెండో ప్ర‌య‌త్నంలో సాధించాడు. ఈ మెడ‌ల్‌తో టోక్యో పారాలింపిక్స్‌లో భార‌త్ ప‌త‌కాల సంఖ్య రెండుకి చేరింది.

24 మంది సభ్యుల అథ్లెటిక్స్ జట్టులో నిషిద్‌ కూమార్‌ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి  రెండో స్థానం లో నిలిచాడు. పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ని  ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పురుషల హై జంప్‌ టీ47 విభాగంలో నిషాద్‌ కుమార్‌ రజతం సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 52) లో భారతదేశానికి చెందిన క్రీడాకారుడు వినోద్ కుమార్ 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ను త్రో చేసి కాంస్య పతకాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఈ ప్రక్రియలో అతడు కొత్త ఆసియా రికార్డును కూడా సృష్టించాడు.వినోద్‌ కుమార్‌ కాంస్యం గెలవడంతో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది.