దేశీయ మైక్రోబ్లాగింగ్ ‘కూ’  కు కోటిమంది యూజర్లు 

ప్ర‌ముఖ దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’.. కోటి మంది యూజ‌ర్ల మార్క్‌కు చేరుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫేమ‌స్ అయిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పోటీగా వ‌చ్చిన ఈ యాప్‌.. దేశీయ భాష‌ల్లో పోస్టులు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది.
 
 తాజాగా ఈ యాప్ కోటి మంది యూజ‌ర్ల‌కు చేరువైంది.ఇంకో సంవ‌త్స‌రంలో 10 కోట్ల మంది యూజ‌ర్ల‌కు రీచ్ అవ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్నామ‌ని ‘కూ’.. కో ఫౌండ‌ర్ అప్ర‌మేయ రాధాకృష్ణ వెల్ల‌డించారు.
 
భారత్ లో మైభారత్మై క్రోబ్లాగింగ్‌కు చాలా త‌క్కువ ప‌ర్సంటేజ్ యూజ‌ర్లు ఉన్నారు. అది కూడా 2 శాతం కంటే త‌క్కువ‌. అది కూడా ఇంగ్లీష్ భాష‌లోనే త‌మ భావాల‌ను వ్య‌క్త ప‌రుస్తుంటారు. కానీ.. మిగ‌తా 98 శాతం యూజ‌ర్ల సంగతి ఏంటి? మిగ‌తా 98 శాతం యూజ‌ర్ల‌కు కూడా త‌మ భావాల‌ను త‌మ భాష‌లో వ్య‌క్త‌ప‌రిచే వేదిక‌నే మేము అందిస్తున్నాం.
అదే ‘కూ’. అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ‘కూ’ను ప్రారంభించిన 16 నెల‌ల్లోనే కోటి మంది యూజ‌ర్ల‌ను సంపాదించుకుంది. గ‌త ఫిబ్ర‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కే 85 ల‌క్ష‌ల డౌన్‌లోడ్స్ అయిన‌ట్టు ‘కూ’ సంస్థ వెల్ల‌డించింది. ‘కూ’ యాప్‌.. హిందీ, తెలుగు, బెంగాలీ లాంటి ప‌లు దేశీయ భాష‌ల‌ను స‌పోర్ట్ చేస్తుంది. అందుకే.. యూజ‌ర్లు  త‌మ సొంత భాష‌ల్లో కూలో పోస్టులు పెట్టుకోవ‌చ్చు. త‌మ సొంత భాష‌ల్లో త‌మ భావాల‌ను వ్య‌క్తప‌రచ‌వ‌చ్చు.