
అప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్నప్పటి నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం చర్చించనుంది. ఇందుకోసం ఈనెల 26న వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటరీ నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది.
అప్ఘన్ సంక్షోభం, అక్కడి పరిస్థితులను సమావేశంలో వివరించాల్సిందిగా విదేశాంగ శాఖను ప్రధాని మోదీ ఆదేశించినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివరిస్తారని ఆయన పేర్కొన్నారు.
కాబూల్ తాలిబాన్ గుప్పిట్లోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడి భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకువస్తున్న నేపథ్యంలో మోదీ ఈ తాజా ఆదేశాలిచ్చారు. అఖిలపక్ష సమావేశంలో అప్ఘనిస్థాన్‌లో నివససిస్తున్న భారతీయులను స్వదేశానికి తరలించే అంశం, ఆ దేశ పరిస్థితిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో అప్ఘనిస్థాన్ నుంతి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సంబంధింత అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఈనెల 17న జాతీయ భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఆదేశాలిచ్చారు. సురక్షితంగా అందర్నీ అప్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంఈఏ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా అప్ఘన్ నుంచి భారతీయుల తరలింపు మిషన్‌లో భాగంగా ఇంతవరకూ సుమారు 730 మందిని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకువచ్చింది. వీరిలో అప్ఘన్ సిక్కులు, హిందూ కమ్యూనిటీకి చెందిన వారు కూడా ఉన్నారు. సోమవారంనాడు ఖతార్ రాజధాని దోహా నుంచి నాలుగు వేర్వేరు విమానాల్లో 146 మందిని భారత్ వెనక్కి తీసుకువచ్చింది. వీరందరినీ అప్ఘన్‌లో భద్రతా పరిస్థితి పూర్తిగా విషమించడానికి ముందే అక్కడి నుంచి నాటో, అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇటీవల ఖతార్ తరలించారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే