మణిపూర్‌ గవర్నర్‌గా లా గణేశన్‌

బీజేపీ సీనియర్‌ నాయకుడు‌, రాజ్యసభ మాజీ సభ్యుడు లా గణేశన్‌ మణిపూర్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇక్కడ గవర్నర్‌గా పనిచేసిన నజ్మా హెప్తుల్లా పదవీ విరమణ చేయడంతో గణేశన్‌ను గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.

బీజేపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించిన లా గణేశన్‌.. తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. లా గణేషన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా నజ్మా హెప్తుల్లా స్థానంలో 2016-2018 వరకు కొనసాగారు.

తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులవడానికి ముందు, ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నారు. 

డాక్టర్ నజ్మా హెప్తుల్లా 2016 ఆగస్టు నెలలో మణిపూర్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నజ్మా హెప్తుల్లా ఆగస్టు 20 న పదవీ విరమణ చేయడంతో లా గణేశన్‌ను గవర్నర్‌గా నియమించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఐదేండ్ల కాలం విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన నజ్మా హెప్తుల్లా ఆరోగ్య సమస్యల కారణంగా గవర్నర్‌ పదవీకి రాజీనామ సమర్పించారు.