తాలిబన్ల నుండి ఆఫ్ఘన్ పౌరులకు ఫేస్‌బుక్ రక్షణ!

తాలిబన్ల అరాచకాల నుండి ఆఫ్గనిస్తాన్ పౌరులకు రక్షణ కల్పించేందుకు ఫేస్‌బుక్ సిద్దపడింది.  పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో వారి వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు తాలిబన్లు సోషల్ మీడియా వేడుకలలో అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సమాచారం తెలిసిన వెంటనే సోష‌ల్ నెట‌వ‌ర్క్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్‌, లింక్‌డిన్.. వెంట‌నే తాలిబ‌న్ల నుంచి అప్ఘాన్ పౌరుల‌ను కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 
ఆఫ్ఘన్ పౌరుల వివరాలు ఏవీ సెర్చ్ లో కనిపించకుండా ఫేస్‌బుక్ దాచివేస్తున్నది. అప్ఘాన్ పౌరుడి ఫేస్‌బుక్ ఖాతాను సెర్చ్ రిజ‌ల్ట్స్‌లో క‌నిపించ‌కుండా ఫేస్‌బుక్ హైడ్ చేసింది. దీంతో తాలిబ‌న్లు.. వాళ్ల గురించి ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేసినా రిజ‌ల్ట్స్ క‌నిపించ‌వు. ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నా.. సెర్చ్ యూజ‌ర్స్ కొట్టినా కూడా.. వాళ్ల అకౌంట్లు క‌నిపించ‌కుండా ఫేస్‌బుక్ చేసింది.
 
అలాగే అప్ఘాన్ పౌరులంతా.. ఖ‌చ్చితంగా త‌మ ఫేస్‌బుక్ అకౌంట్‌ను లాక్ చేసుకోవాల‌ని ఫేస్‌బుక్ సూచించింది. వ‌న్ క్లిక్ టూల్ అనే కొత్త టూల్‌ను కేవ‌లం అప్ఘ‌నిస్థాన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ స్టార్ట్ చేసింది. దీని ద్వారా  త‌మ అకౌంట్‌ను లాక్ చేసుకోవచ్చు. దీని వ‌ల్ల‌ త‌న ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ లిస్టులో లేని వాళ్లు ఆ అకౌంట్‌ను యాక్సెస్ చేయ‌లేరు.
 
ట్విట్ట‌ర్ కూడా అప్ఘాన్ పౌరుల ర‌క్ష‌ణ కోసం వ‌ర్క్ చేస్తోంది. అప్ఘాన్‌కు సంబంధించిన అర్కైవ్ అయి ఉన్న పాత ట్వీట్ల‌ను అన్నింటినీ  ట్విట్ట‌ర్ తొల‌గిస్తోంది. అలాగే ట్విట్ట‌ర్ నుంచి డైరెక్ట్ మెసేజ్ పంపించ‌డం లేదా ఏదైనా బెదిరించే స‌మాచారం పంపించే అకౌంట్ల‌ను యూజ‌ర్లు యాక్సెస్ చేసుకోలేక‌పోతే ఆయా యూజ‌ర్ల అకౌంట్ల‌ను తాత్కాలికంగా స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ట్విట్ట‌ర్ ప్ర‌క‌టించింది. 
 
త‌ర్వాత ఆయా యూజ‌ర్లు తమ అకౌంట్‌కు లాగిన్ అయి ఆ కంటెంట్‌ను డిలీట్ చేసుకోవ‌చ్చు. లింక్‌డిన్ కూడా అప్ఘాన్‌కు చెందిన త‌మ యూజ‌ర్ల అకౌంట్ల‌ను హైడ్ చేసింది. దాని వ‌ల్ల‌.. ఇత‌ర దేశాల‌కు చెందిన ఏ పౌరులు కూడా ఆ అకౌంట్‌ను యాక్సెస్ చేసుకునే వీలు ఉండ‌దు.