కో-ఎడ్యుకేష‌న్ కు స్వ‌స్తి ….మూడు జిల్లాలో తాలిబన్లపై తిరుగుబాటు

అనుకున్నట్లుగానే మహిళలను కట్టడి చేసేందుకు తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ లో రంగంలోకి దిగుతున్నారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ యూనివ‌ర్సిటీల్లో కో-ఎడ్యుకేష‌న్ ప‌ద్ధ‌తికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ఆప్ఘ‌నిస్ధాన్‌లోని హెర‌త్ ప్రావియ‌న్స్‌లో తాలిబ‌న్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఒకే క్లాసులో విద్యార్ధుల‌తో క‌లిసి విద్యార్ధినులు కూర్చునేందుకు అనుమ‌తించ‌రాద‌ని తాలిబ‌న్లు తొలి ఫ‌త్వా జారీ చేశారు. యూనివ‌ర్సిటీ లెక్చ‌ర‌ర్లు, ప్రైవేట్ విద్యాసంస్ధ‌ల యజ‌మానుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించిన అనంత‌రం కో ఎడ్యుకేష‌న్‌ను అనుమ‌తించ‌రాద‌ని ఈ విధానాన్ని నిలిపివేయాల‌ని తాలిబ‌న్ అధికారులు స్ప‌ష్టం చేశారు.
ప్ర‌భుత్వ యూనివ‌ర్సిటీలు, విద్యా సంస్ధ‌ల్లో విద్యార్ధినీ, విద్యార్ధుల‌కు వేర్వేరుగా త‌ర‌గ‌తులు నిర్వ‌హించే వెసులుబాటు ఉంటుంద‌ని, అయితే  ప్రైవేట్ విద్యాసంస్ధ‌ల్లో విద్యార్ధినుల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టంతో వారికి ప్ర‌త్యేకంగా త‌ర‌గతులు నిర్వ‌హించ‌డం ఆయా సంస్ధ‌ల‌కు భార‌మ‌వుతుంద‌ని లెక్చ‌ర‌ర్లు భావిస్తున్నారు.
అయితే స‌మాజంలో అన్ని అన‌ర్ధాలకు కార‌ణ‌మైన కో ఎడ్యుకేష‌న్ వ్య‌వ‌స్ధ‌ను ర‌ద్దు చేయాల‌ని తాలిబ‌న్ల వాద‌న వినిపించేందుకు ఈ స‌మావేశానికి హాజ‌రైన ఆప్ఘ‌నిస్ధాన్ ఇస్లామిక్ ఎమిరేట్, ఉన్న‌త విద్య చీఫ్ ముల్లా ఫ‌రీద్ స్ప‌ష్టం చేశారు. విద్యార్ధినుల‌కు మ‌హిళా లెక్చ‌రర్లు, వ‌య‌సు మీరిన లెక్చ‌రర్ల‌తో బోధ‌న సాగించాల‌ని సూచించారు.
ప్రైవేట్ విద్యా సంస్ధ‌లు, విద్యార్ధినీ, విద్యార్ధుల‌కు వేర్వేరుగా త‌ర‌గ‌తులు నిర్వ‌హించే ఆర్ధిక వెసులుబాటు లేనందున తాలిబ‌న్ల తాజా నిర్ణ‌యంతో వేలాది బాలిక‌లు, యువ‌తులు ఉన్న‌త విద్య‌కు దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెర‌త్ ప్రాంత లెక్చ‌రర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
 
మూడు జిల్లాల్లో తాలిబాన్లకు చెక్ 
 
కాగా,  ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు రెబల్‌ ఫోర్స్‌ షాక్‌ ఇచ్చాయి. వారి ఆధీనంలో ఉన్న మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఖైర్ ముహమ్మద్ అందరాబి నేతృత్వంలోని ప్రజా ప్రతిఘటన దళాలు బాగ్లాన్‌ ప్రావిన్స్‌లోని పాల్-ఇ-హేసర్, దేహ్ సలాహ్, బాను జిల్లాలను స్వాధీనం చేసుకున్నాయని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. 
 
ఈ పోరాటంలో సుమారు 40 మంది తాలిబన్‌ ఫైటర్స్‌ మరణించగా, మరో 15 మంది గాయపడినట్లు పేర్కొన్నాయి. తాలిబన్లు ప్రకటించిన మేరకు సాధారణ క్షమాభిక్ష స్ఫూర్తితో వారు పని చేయలేదని ప్రజా ప్రతిఘటన దళాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లను ఎదుర్కొంటామని, మిగతా జిల్లాలను కూడా స్వాధీనం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాయి.
కాగా, రెబల్‌ ఫోర్స్ స్వాధీనం చేసుకున్న జిల్లాల్లో తిరిగి ఆఫ్ఘన్‌ జెండాలను పునరుద్ధరించారు. తాలిబన్ల వశం కాని పంజ్‌షీర్ ప్రావిన్స్‌కు సమీపంలో మూడు జిల్లాలను రెబల్‌ ఫోర్సెస్‌ స్వాధీనం చేసుకున్నాయి. తాలిబన్‌ చేతిలో మరణించిన వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్ ఈ ప్రతిఘటన దళాలకు కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు తాలిబన్లపై ప్రతిఘటన సజీవంగా ఉన్నదని, ఆఫ్ఘనిస్థాన్‌ మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా ముహమ్మది తెలిపారు. తాలిబన్ల ఆధీనంలోని మూడు జిల్లాలను ప్రతిఘటన దళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. తాలిబన్‌ ఉగ్రవాదులను ఎదుర్కోవడం తమ విధి అన్ని ట్వీట్‌ చేశారు.

 
చేర్పించారు” అంటూ ట్వీట్ చేశారు.