పాక్ సైన్యం ఆధీనంలో తాలిబన్ అధినేత!

ఆఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశమౌతున్న వేళ..వారి ప్రధాన నేత హైబతుల్లా అఖుంద్‌జాదా ఎక్కడున్నాడనే దానిపై ఇప్పుడు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై భారత ప్రభుత్వం ఆరా తీస్తోంది. విదేశీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు పంచుకున్న సమాచారాన్ని అధ్యయనం చేస్తోంది. రహస్యంగా ఉన్న అఖుంద్‌జాదాను గుర్తించేందుకు చర్యలు చేపడుతోంది. 

అయితే ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఇప్పుడు అతడు పాకిస్తాన్‌ సైన్యం కస్టడీలో ఉండవచ్చునని చెప్పారు. అయితే గత ఆరు నెలలుగా అతడిని తాలిబన్‌ సీనియర్‌ నాయకులు, ఆఫ్గాన్‌లో హింసాత్మక చర్యలు చేపడుతున్న తాలిబన్లు కూడా చూడలేదు. అతని చివరి బహిరంగ ప్రకటన మేలో రంజాన్‌ సందర్భంగా వచ్చింది. 

అయితే పూర్తిగా ఆఫ్గాన్‌ తాలిబన్ల చేతికి వచ్చాకే ఆయనే అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు  కధనాలు వెలువడ్డాయి. అయినా ఇప్పటి వరకు ఆయన గురించి  ఎటువంటి సమాచారం లేకపోవడం, కనీసం సందేశం కూడా లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

పైగా, గత ఆరు నెలల కాలంలో తాలిబన్‌ ముఖ్య నేతలెవరూ తెరపైకి రాలేదు. సాధారణగా తాలిబన్‌ అగ్రనాయకులు రహస్య ప్రాంతాల్లో ఉంటూ తెర వెనుక నుంచి మంత్రాంగం నడిపిస్తూ ఉంటారు. కాగా, పాకిస్తాన్‌ చెరలో ఉండటంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో అన్న విషయంపై భారత్‌ ఆసక్తి కనబరుస్తుంది. 

మాజీ తాలిబ్‌ నేత అక్తర్‌ మన్సూర్‌ 2016లో అమెరికా డ్రోన్ల దాడిలో మరణించి తర్వాత హైబతుల్లా అఖుంద్‌ జాదా తాలిబన్‌ చీఫ్‌గా నియమితులయ్యారు. తాలిబన్ల బృందంలో హైబతుల్లా కేవలం సైనికుడే కాకుండా రాజకీయ,మిలటరీ, న్యాయపరమైన అంశాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా గుర్తింపు పాండారు. అతను కాందహార్ కు చెందిన ఛాందసవాద మాత ప్రవక్త. 1980 లలో, ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ సైనిక ప్రచారానికి వ్యతిరేకంగా ఇస్లామిస్ట్ ప్రతిఘటనలో పాల్గొన్నాడు, కానీ సైనిక కమాండర్ గా కంటే మత నాయకుడిగానే ప్రసిద్ధి పొందాడు.

అతను కొన్నేళ్లపాటు తాలిబాన్ న్యాయస్థానాలలో సీనియర్ వ్యక్తి ఇస్లామిక్ శిక్షలకు మద్దతుగా పలు  తీర్పులు జారీ చేసాడు. దోషులు, వ్యభిచారులకు బహిరంగ మరణశిక్ష, దొంగతనానికి పాల్పడిన వారి అవయవదానం వంటి శిక్షలు విధించేవాడు. అంతకు ముందు, అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన అప్పటి  తాలిబాన్ చీఫ్ అక్తర్ మొహమ్మద్ మన్సూర్‌కు డిప్యూటీగా పనిచేశాడు. తన తరువాతి, అతనిని తన వారసుడిగా అతని పేరుని వీలునామాలో మన్సూర్ పేర్కొన్నాడు.