బాలీవుడ్‌లో హనీ ట్రాప్‌లో 100 మంది సెలబ్రిటీలు

బాలీవుడ్‌లో హనీ ట్రాప్‌ వ్యవహారం కలకలం రేపుతున్నది. ఏకంగా 100 మంది సెలబ్రిటీలు హనీ ట్రాప్‌లో పడ్డారు. న్యూడ్‌ విజువల్స్‌ రికార్డు చేసి కిలాడీలు బ్లాక్‌మెయిల్‌కు దిగారు. సెలబ్రెటీల ఫిర్యాదులతో ముంబయి సైబర్‌క్రైమ్‌ బ్రాంచ్‌ రంగంలోకి దిగింది. బాధితుల్లో టాప్‌ సెలబ్రిటీలతో పాటు మోడల్స్‌, పెద్దింటి మహిళలు ఉన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

సోషల్‌ మీడియాలో డాక్టర్‌, లాయర్‌, బిజినెస్‌మెన్‌, ఉమెన్‌ అంటూ హైఫ్రొఫైల్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడుతారు. నమ్మకంగా ఉంటూ ఎదుటి వారిని నమ్మిస్తారు. మెల్లిగా వీడియో కాల్స్‌, ఆ తర్వాత న్యూడ్‌ ఫోటోస్‌, న్యూడ్‌ విజవల్స్‌తో వారిని బోల్తా కొట్టిస్తారు.

ఇలా.. ఒకరా ఇద్దరా ఏకంగా వంద మంది సెలబ్రెటీలు వీరి ట్రాప్‌లో పడ్డారు. బాధితుల జాబితాలో టాప్‌ సెలబ్రిటీలతో పాటు మోడల్స్‌, ధనిక మహిళలు, పురుషులు ఉన్నారు. విస్తృతంగా అందుబాటులో ఉన్న పలు సోషల్‌ మీడియా యాప్‌లను వాడుకొని వీడియో కాల్స్‌ను రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతానని బ్లాక్‌ మెయిల్‌కు దిగుతారు.

డబ్బులు డిమాండ్‌ చేసి మొత్తం ఊడ్చేస్తారు. అంతటితో ఆగకుండా అదే వీడియోలను డార్క్‌వెబ్‌లోని ఫోర్న్‌ సైట్లకు అమ్ముతారు. ఇలా రెండు విధాలుగా డబ్బులు సంపాదిస్తారు. ఏకంగా ట్విట్టర్‌లో పెట్టేసి వీడియోలు అమ్మిన కేటుగాళ్లూ ఉన్నారు.

ముంబయి సైబర్‌ సెల్‌కి సెలబ్రిటీల నుంచి ఫిర్యాదులు వెల్లువలా వచ్చిపడటంతో రంగంలోని దిగిన అధికారులు ఇప్పటికే  ఓ ముఠాను నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 285 మంది నగ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాగా ఒకరు మైనర్‌. వీరి నుంచి పెద్ద ఎత్తున మొబైల్‌ ఫోన్‌లు, 12 నకిలీ ఖాతాలు, ఇతర ఎలక్ట్రరానిక్‌ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.