వారణాసి వలే కాశ్మీర్ చిరకాలంగా సంస్కృత కేంద్రం

వారణాసి వలే జమ్మూ కాశ్మీర్ కూడా సంస్కృతంకు ఎల్లప్పుడూ గొప్ప కేంద్రంగా ఉంటూ వస్తున్నదని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. దాని వైభవాన్ని పునరుద్ధరించడానికి, ప్రోత్సహించడానికి అవకాశాలు సృష్టించడమే ప్రభుత్వంకు ముఖ్యం అని చెప్పారు.

ఆయన బసోహ్లీలోని చుడమణి సంస్కృత సంస్థాన్ నూతన  భవనానికి శంకుస్థాపన చేసి “సాహ్కి” పేరుతో బసోహ్లి ఆర్ట్ గ్యాలరీని  ఆవిష్కరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ రంజిత్ సాగర్ డ్యామ్ వద్ద వాటర్ స్పోర్ట్స్ సెంటర్ ఇ-ఫౌండేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు, దీనిని మార్చి 2022 నాటికి రూ .3 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తారు. 

రూ .8.39 కోట్ల విలువైన పిడబ్ల్యుడి, ఆరోగ్య,  విద్యా రంగ అభివృద్ధి పనులతో పాటుగా రూ .8.76 కోట్లతో నిర్మించిన జిడిసి  బాని మౌలిక సదుపాయాలను ప్రారంభించారు, “ప్రత్యేకంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులకు కృత్రిమ సాయం అందించే కార్యక్రమం”  దివ్యాంగ్ సహాయక్‌ను కూడా ప్రారంభించారు. 

దేశంలో వివిధ ప్రాంతాలను ఏకం చేసి, గురు, శిష్యుల మధ్య సన్నిహిత సంబం ధాన్ని సృష్టించిన ఏర్పర్చగల ఏకైక భాష సంస్కృతం అని మనోజ్ సిన్హా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.”సంస్కృత భాష విలువలను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఒప్పెన్‌హైమర్, మాక్స్ ముల్లర్ వంటి గొప్ప మేధావులు కూడా గుర్తించారని ఆయన పేర్కొన్నారు.

ఆధునిక అవసరాలకు అనుగుణంగా పాఠశాలల్లో సంస్కృతం బోధించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నేటి తరం ఎదుగుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ సంస్కృత గ్రంథాలలో జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటుందని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఐదు అధికారిక భాషలతో పాటు కొత్త విద్యా విధానం సిఫార్సుల ప్రకారం సంస్కృత భాషను ప్రోత్సహించడానికి, అభినవ్ గుప్తా ఇనిస్టిట్యూట్ స్థాపించడానికి  ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రంజిత్ సాగర్ డ్యామ్‌లోని స్పోర్ట్స్ సెంటర్ స్థానిక క్రీడాకారులకు ఉపాధి మార్గాలను సృష్టించడంతో పాటు, వివిధ క్రీడా విభాగాలలోని బాలబాలికలకు పుష్కలంగా అవకాశాలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. 


“బసోలి  చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించడానికి, శ్రీనగర్‌లోని వాటర్ స్పోర్ట్స్ సెంటర్ తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో జల క్రీడలకు ఒక ప్రత్యేక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి మేము కృషి చేస్తున్నాము, క్రీడా ప్రతిభకు అవసరమైన అన్ని వనరులను అందిస్తున్నాము” అని సిన్హా అన్నారు.వివరించారు. 

పురావస్తు శాఖ నివేదికను ఉటంకిస్తూ, సిన్హా బసోలి కళ విశిష్టత,  జీవశక్తి గురించి అనేక  శతాబ్దాల తర్వాత కూడా పరిశోధకులు అన్వేషిస్తున్నారని తెలిపారు.