పాక్ లో మహారాజా రంజిత్‌ సింగ్‌కు అవమానం

పాకిస్తాన్‌లో భారతీయ మహారాజు మహారాజా రంజిత్‌ సింగ్‌కు తీరని అవమానం జరిగింది. లాహోర్‌ కోటలో ప్రతిష్ఠించిన మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహాన్ని కొంతమంది దుండగులు కూల్చివేశారు. దాంతో విగ్రహం ముక్కలు ముక్కలైంది. 

విగ్రహం కూల్చివేసిన తర్వాత గుర్రం మాత్రం అలాగే ఉండిపోయింది. 19 వ శతాబ్ద కాలం నాటి సిక్కు రాజు అయిన మహారాజా రంజింత్‌ సింగ్‌ 9 అడుగుల పొడవైన విగ్రహాన్ని కాంస్యంతో తయారుచేశారు.

పాకిస్తాన్‌ లాహోర్‌ కోటలో మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహాన్ని సోమవారం సాయంత్రం కొందరు దుండగులు కూల్చివేశారు. దాంతో విగ్రహం ముక్కలుముక్కలైంది. కోటలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని కూల్చివేయడంతో దిమ్మెపై గుర్రం మాత్రం ఉండిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెహ్రీక్‌-ఏ-లబ్బాయిక్‌ పాకిస్తాన్‌ (టీఎల్‌పీ) కి చెందిన కార్యకర్త రిజ్వాన్‌ ఈ విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇలాంటి దుర్మార్గుల కారణంగానే పాకిస్తాన్‌ ఇమేజ్‌ మంటగలిసి పోతున్నదని పాకిస్తాన్‌ సమచార, ప్రసారాల శాఖ మంత్రి ఫవాద్‌ చౌధరీ విచారం వ్యక్తం చేశారు. 

ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది మూడవసారి. మంజీందర్‌సింగ్ సిర్సా అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దేశంలోని మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు, తీవ్రవాద అంశాలకు మద్దతిస్తున్నందుకు పాకిస్తాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో చౌధరీ వ్యాఖ్యలు వచ్చాయి.