రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు క్యాష్‌బ్యాక్

రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మహిళలకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే మహిళలకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది. 

రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే మహిళలు ఆగస్టు 24 వరకు టికెట్ ఛార్జీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారని ఒక ప్రకటనలో ఐఆర్‌సీటీసీ తెలిపింది. మహిళా ప్రయాణికులు ఆగస్టు 24 లోపు ఈ ఆఫర్‌ను వినియోగించుకుని ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు.

ఈ ఆఫర్ కింద క్యాష్‌బ్యాక్ మొత్తం టిక్కట్‌ బుక్ చేయబడిన ఖాతాకే జమ చేస్తారు. ప్రకటన రావడానికి ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకున్న వారికి, ఆఫర్ వ్యవధిలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులు కూడా క్యాష్‌బ్యాక్ పొందడానికి అర్హులు.

రోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున 4 నెలల క్రితం రద్దు చేసిన ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలను తిరిగి ఆగస్టు 7 నుంచి ప్రారంభించింది. ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి వారానికి నాలుగు రోజులు శుక్ర, శని, ఆదివారం, సోమవారం పని చేస్తాయి.