రెండేండ్ల‌లో ఓలా ఎల‌క్ట్రిక్ కారు!

ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఓలా ఎల‌క్ట్రిక్‌ రెండేండ్ల‌లో ఫ్యూచ‌రిస్టిక్ డిజైన్‌తో ఎల‌క్ట్రిక్ కారును కూడా ఆవిష్క‌రిస్తామ‌ని చెబుతున్న‌ది. ఎల‌క్ట్రిక్ కారు డిజైన్ కోసం టాటా డిజైన‌ర్ల‌ను ఇప్ప‌టికే ఓలా ఎలక్ట్రిక్ టాటా డిజైన‌ర్ల‌ను సంప్ర‌దించింది. 

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 400 న‌గ‌రాల ప‌రిధిలో ల‌క్ష చార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటుపై ద్రుష్టి సారించింది. ఎల‌క్ట్రిక్ స్టేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై దేశీయ టెక్నాల‌జీతో అభివ్రుద్ధి చేసిన ఎల‌క్ట్రిక్ కారు అందుబాటులోకి రానున్న‌ది. ప‌రిమిత శ్రేణిలోనే ఎల‌క్ట్రిక్ కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంద‌ని వార్త‌లొచ్చాయి.

సెగ్మెంట్‌ల‌ను బ‌ట్టి ఎల‌క్ట్రిక్ కారు ధ‌ర చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంద‌ని ఓలా ఎల‌క్ట్రిక్ ఫౌండ‌ర్ కం సీఈవో భ‌విష్ అగ‌ర్వాల్ చెప్పారు. బెంగ‌ళూరులోని కంపెనీ గ్లోబ‌ల్ డిజైన్ సెంట‌ర్‌లో త‌మ తొలి ఎల‌క్ట్రిక్ కారు రూపుదిద్దుకుంటుంద‌ని తెలిపారు.

ఎల‌క్ట్రిక్ కారు ప్రాజెక్టు కోసం టాటా డిజైన‌ర్ల‌ను ఇప్ప‌టికే ఓలా ఎల‌క్ట్రిక్ సంప్ర‌దించింది. ఓలా ఎల‌క్ట్రిక్ మొబిలిటీలో టాటా స‌న్స్ గౌర‌వ చైర్మ‌న్ ర‌త‌న్ టాటా పెట్టుబ‌డులు పెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో ఓలా ఎల‌క్ట్రిక్ మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆదివారం ఓలా విడుద‌ల చేసిన తొలి స్కూట‌ర్ రెండు వేరియంట్ల‌లో ల‌భ్యం అవుతుంది. ఎస్‌1 వేరియంట్ స్కూట‌ర్ ధ‌ర రూ.99,999, ఎస్‌1 ప్రో ధ‌ర రూ.1.29 ల‌క్ష‌లకు ల‌భిస్తుంద‌ని ఓలా ఎల‌క్ట్రిక్ ప్ర‌క‌టించింది.