`ఆఫ్ఘన్ వైఫల్యం’పై బిడెన్ రాజీనామా కోరిన ట్రంప్ 

దాదాపు 20 సంవత్సరాల తర్వాత అమెరికా సైన్యం దేశం నుండి వైదొలిగినందున, తాలిబాన్ తీవ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ను వేగంగా స్వాధీనం చేసుకున్నందుకు తన వారసుడు జో బిడెన్ రాజీనామా చేయాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. “ఆఫ్ఘనిస్తాన్‌లో ఆ విధంగా జరగడానికి జో బిడెన్ అవమానంతో రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది,” అని ట్రంప్ ఒక ప్రకటనలో చెప్పారు. అమెరికాలో కరోనా కేసులు, దేశీయ ఇమ్మిగ్రేషన్, ఆర్థిక, ఇంధనం వంటి విధానాలపై బిడెన్ పై విరుచుకుపడ్డారు.

అమెరికా దండయాత్రతో తాలిబన్లు కూలిపోయిన 20 సంవత్సరాల తర్వాత మెరుపు వేగంతో అఫ్గానిస్థాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశం నుండి అమెరికన్ దళాలను ఉపసంహరించుకోవాలని బిడెన్ నిర్దేశించిన ఆగస్టు 31 గడువుకు రెండు వారాల ముందే వారు ఆదివారం కాబూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ట్రంప్ హయాంలోనే 2020 లో దోహాలో తాలిబన్‌లతో అమెరికా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఇది మిలిటెంట్ల నుండి వివిధ భద్రతా హామీలకు బదులుగా మే 2021 నాటికి అమెరికా తన సైన్యాలన్నింటినీ ఉపసంహరించుకునేలా చేస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో బిడెన్ అధికారం చేపట్టినప్పుడు,  ఉపసంహరణకు గడువును ఎటువంటి షరతులు పెట్టకుండా వెనుకకు నెట్టారని ట్రంప్ విమర్శించారు. ఈ చర్యపై బిడెన్‌పై ట్రంప్ పదేపదే విరుచుకుపడుతున్నారు. 

కాగా, తనకు ఇంకా అధ్యక్ష పదవిలో ఉండిఉంటే, “చాలా భిన్నమైన, మరింత విజయవంతంగా ఉపసంహరించుకునేవారం” అని ట్రంప్ చెప్పుకొచ్చారు. “ఆఫ్ఘనిస్తాన్‌తో జో బిడెన్ చేసినది అమెరికన్ చరిత్రలో గొప్ప ఓటములలో ఒకటిగా నిలిచిపోతుంది!” ఆయన ట్రంప్ ధ్వజమెత్తారు.

అయితే ట్రంప్ విమర్శలను కొట్టిపారవేస్తూ, సేనల ఉపసంహరణపై దోహా ఒప్పందంపై ట్రంప్ చర్చలు జరిపారనే ఆగ్రహంతో, అమెరికా ప్రజలలో ఎక్కువమంది “ఎప్పటికీ యుద్ధాలు” ముగించాలని బిడెన్ పరిపాలన కోరుకున్నారని అంటూ బిడెన్ ప్రభుత్వం ఎదురు దాడి చేసింది.

మరోవంక, ఉపసంహరణ నిబంధనలకు అమలు చేయడంలో బిడెన్ సరిగ్గా వ్యవహరింపలేదని అంటూ అమెరికాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం త్వరగా కూలిపోతుందనే భయంతో అమెరికా తన విస్తారమైన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయటానికి పోటీపడిందని అంటూ ఎద్దేవా చేస్తున్నారు.