పెగాసస్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంకు గోవిందాచార్య

స్నూపింగ్ ఆరోపణలపై ఫేస్‌బుక్, వాట్సాప్, పెగాసస్ స్పైవేర్ తయారీదారు ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని,నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు కోరుతూ 2019 లో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి కెఎన్ గోవిందాచార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ,

గోవిందాచార్య తన తాజా పిటిషన్‌లో, “భారతదేశంలో పెగాసస్ వినియోగం పరిమాణాన్ని నిర్ధారించడానికి దానికి బాధ్యులైన సంస్థలపై  న్యాయమైన, నిష్పాక్షికమైన,  బాధ్యతాయుతమైన దర్యాప్తును” కోరారు. 

ఆయన దీనిని “చట్టవిరుద్ధమైన నిఘా” అని పేర్కొంటూ  “జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు అతిపెద్ద ముప్పును అందిస్తుంది.  వాస్తవానికి సైబర్ టెర్రరిజం, ఇది సమాచార చట్టం, 2000 లోని ఎస్. 66 ఎఫ్  కింద శిక్షార్హమైనది”  అని స్పష్టం చేశారు.

పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి అనేక మంది భారతీయ పౌరుల ఫోన్‌లు హ్యాక్ చేయబడ్డాయని వాట్సాప్ వెల్లడించిన నేపథ్యంలో గోవిందాచార్య 2019 లో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. యూజర్ డేటా పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేయబడిందని, వాట్సాప్‌తో సహా ఎవరి వద్ద కీ లేదని పేర్కొనడం ద్వారా మునుపటి ప్రొసీడింగ్‌లో కోర్టును “తప్పుదోవ పట్టించారు” అని వాట్సాప్‌పై కూడా విచారణ జరపాలని ఆయన కోరారు.

ఆగస్టు 16 న స్నూపింగ్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ల విచారణను చేపట్టనున్న కోర్టు విచారణకు ఈ  దరఖాస్తును జతచేసి అవకాశం ఉంది.