రాయలసీమ ఎత్తిపోతల సివిల్ పనులన్నీ పూర్తి

ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించడమే కాదు,  కాంక్రీట్‌ పనులు మినహా సివిల్‌ పనులన్నింటినీ పూర్తిచేసిందని కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్‌ఎంబీ) పరిశీలన బృందం వెల్లడించింది. దీంతో ఇంతకాలం తాము కేవలం ఇన్వెస్టిగేషన్‌ పనులు, జియోలాజికల్‌ సర్వే మాత్రమే చేస్తున్నామని, డీపీఆర్‌ల కోసమే తవ్వకాలు జరుపుతున్నామంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదన బూటకమని తేలిపోయింది.

అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని పేర్కొంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో తెలంగాణ పిటిషన్‌ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్జీటీ ప్రాజెక్టు ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 13లోగా నివేదిక ఇవ్వాలని కేఈఆర్‌ఎంబీని ఆదేశించింది. 

ఈ మేరకు కేఆర్‌ఎంబీ శనివారం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల ఫొటోలతో మిగతా 2వ సీమ లిఫ్ట్‌ పచ్చి నిజం సహా 12 పేజీల నివేదికను ఎన్జీటీకి సమర్పించింది.రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు డిపిఆర్‌ తయారీ అవసరానికి మించి పనులు జరిగాయని కెఆర్‌ఎంబి నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని పేర్కొంది.

ఎన్‌జిటి ఆదేశాల మేరకు ఈ నెల 11న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సైట్‌ను కెఆర్‌బిఎం నిపుణుల కమిటీ సభ్యులు డిఎం రారుపురె, మౌతాంగ్‌, దర్పన్‌ తల్వర్‌ సందర్శించారు. వీరి నివేదిక ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అప్రోచ్‌ ఛానల్‌, ఫోర్‌ బే, పంప్‌ హౌస్‌, పైపులైన్‌, డెలివరీ సిస్టం, లింక్‌ కెనాల్‌ పనులు జరుగుతున్నాయి. 

రాయలసీమ ఎత్తిపోతల పథకం లో భాగంగా శ్రీశైలం రిజర్వాయటర్‌ 800 ఫీట్ల నుంచి 8.8 కిలోమీటర్ల పొడవున తవ్వాల్సిన అప్రోచ్‌ చానల్‌ పనులన్నీ పూర్తయ్యాయి. ఫోర్‌బే ప్రాంతానికి, అప్రోచ్‌ చానల్‌కు మధ్య 15 మీటర్ల తవ్వకం పనులు మాత్ర మే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే తవ్వి న అప్రోచ్‌ చానల్‌లోకి వచ్చిన నీటి ఆధారంగా దీనిని అంచనా వేశారు. 

సమీపంలోనే బ్యాచింగ్‌ ప్లాంట్లు కూడా నిర్మించారు. ఇసుక, ఐరన్‌తో పాటు ఇతర నిర్మాణ సామగ్రి సైట్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు కోసం నిర్మించిన అప్రోచ్‌ కెనాల్‌ పూర్తిగా నీటితో నిండి ఉంది. 250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో పంపుహౌస్‌ నిర్మాణం జరుగుతోంది. డిపిఆర్‌లో పేర్కొన్నట్లుగా మొత్తం 12 టన్నెల్స్‌లో 10 టన్నెల్స్‌ నిర్మాణం పూర్తయింది. 

డెలివరీ సిస్టం – శ్రీశైలం కుడి ప్రధాన కాలువ లింకు చేసేందుకు 500 మీటర్ల పొడవుతో కాలువ నిర్మాణం జరిగింది. 150 నుంచి 180 అడుగుల లోతులో ఫోర్‌బే నిర్మాణం జరిగింది.