ఏపీలో 6.2 శాతం పెరిగిన ఓటింగ్

నాలుగో దశ పోలింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓట్ల సంఖ్య రీత్యా పోలింగ్‌ 6.2 శాతం పెరిగింది. 2019 ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. ఈ ఎన్నికల్లో 19.5 లక్షల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. దీంతో ఓటింగ్‌ శాతం కూడా పెరిగిందని తాజాగా ఎస్‌బిఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది..
 
2024 జరిగిన ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. కర్ణాటకలో 35.5 లక్షలు, తెలంగాణ 31.9 లక్షలు, మహారాష్ట్ర 20.0 లక్షలు పెరిగినట్లు ఎస్‌బిఐ నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో 8.35 లక్షల మంది మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పిఎంఎవై) పథకం ప్రభావం చూపుతుందని ఈ నివేదిక వెల్లడించింది. 
 
ఏపీలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద మంజూరైన 19.9 లక్షల ఇళ్లు గ్రౌండ్‌లెవల్లో లేచాయి. దీంతో ఈ పథకం ప్రభావం ఏపీలో కూడా మహిళలపై చూపిందని ఈ నివేదిక పేర్కొంది. 2019లో పోల్చితే ఈ ఏడాది ఓటర్లు పెరిగారు. గత ఎన్నికల్లో నియోజవర్గాల వారీగా చూస్తే 2019లో 42.6 కోట్ల ఓటర్లు ఉండగా  కోట్ల ఓటర్లకు పెరిగారు. సుమారుగా మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా 6 శాతం ఓటర్లు పెరిగారు. 
 
ఓటర్లు పెరిగిన రాష్ట్రాల్లో మొదటిస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. ఆ తర్వాత కేరళ (-5.3 లక్షలు), మణిపూర్‌ (-3.4 లక్షలు), నాగాలాండ్‌ (-2.4 లక్షలు) రాష్ట్రాలు ఉన్నాయి. సాధారణ నియోజకవర్గాల్లో కంటే. జర్వ్‌డ్‌ కేటగిరీల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగానే పెరుగుతోది. దీన్నిబట్టి ప్రజాస్వామ్య పునాదులు మరింత బలపడుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. 
 
2019 ఎన్నికలతో పోల్చితే ఈ నాలుగు దశల ఎన్నికల్లో 1.78 కోట్ల ఓటర్లు పెరిగారని ఎస్‌బిఐ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా పురుషుల ఓటర్లతో పోల్చితే.. మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. పురుష ఓటర్లు 84.7 లక్షల సంఖ్యగా ఉంటే.. మహిళా ఓటర్లు 93.5 లక్షలుగా ఉంది. ఈ ట్రెండ్‌ చూస్తే.. భవిష్యత్తులో భారత రాజకీయాల్లో మహిళలు కీలకంగా మారునున్నారని అర్థమవుతోంది. 
 
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో 4.1 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈ రాష్ట్రంలో పురుష ఓట్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. సుమారు 2.1 మిలియన్ల ఓట్లతో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. ప్రత్యేకించి 37 నియోజకవర్గాల్లో పురుషుల కంటే ఐదు వేల ఓట్లతో ఓట్లు వేసిన మహిళల సంఖ్య మించిపోయింది. ఇక 175 నియోజకవర్గాల్లో 155 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని ఈ నివేదిక తెలిపింది.