మైనారిటీ పాఠశాలలను ఆర్టీఇ పరిధిలోకి తీసుకురావాలి 

దేశంలోని మదరసాలతో సహా అన్ని పాఠశాలలను విద్యా హక్కు, సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం పరిధిలోకి తీసుకురావాలని జాతీయ బాలల హక్కుల కమీషన్ ( ఎన్‌సిపిసిఆర్) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశ వ్యాప్తంగా మైనారిటీ పాఠశాలలను అధ్యయనం చేసిన తర్వాత ఈ సిఫార్సు చేసింది.

అటువంటి పాఠశాలల్లో మైనారిటీ వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్‌ కల్పించాలని కూడా ఎన్‌సిపిసిఆర్ స్పష్టం చేసింది. మైనారిటీ పాఠశాలలో మైనారిటీయేతర విద్యార్థులు ఎక్కువ శాతం చదువుతున్నారని గమనించినట్లు తెలిపింది. ఎన్‌సిపిసిఆర్ విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం, క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లో 74 శాతం మంది విద్యార్థులు మైనారిటీయేతర వర్గాలకు చెందినవారు. మొత్తంమీద, అటువంటి పాఠశాలల్లో 62.50 శాతం విద్యార్థులు మైనారిటీయేతర వర్గాలకు చెందినవారు.


“మైనారిటీ వర్గాల విద్యపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఎ కి సంబంధించి ఆర్టికల్ 15 (5) ప్రకారం మినహాయింపు ప్రభావం ” అనే శీర్షికన విడుదల చేసిన నివేదిక ప్రకారం,  బడిబయట ఉన్న 1.1 మంది బడి పిల్లల్లో అత్యధికంగా ముస్లిం సమాజంకు చెందినవారే అని వెల్లడించింది. 

“ఈ అధ్యయనం లక్ష్యం మైనారిటీ విద్య సంస్థలను ఇతరత్రా తప్పనిసరిగ్గా అమలు జరిపే విద్య హక్కు చట్టం నుండి మినహాయింపు కలిగిస్తున్న 93 వ రాజ్యాంగ సవరణ మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలను ఎలా ప్రభావితం చేసిందో. ఏవైనా అంతరం కలిగిస్తున్నదో అంచనా వేయడం” అని ఎన్‌సిపిసిఆర్ ఛైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో చెప్పారు. 

“మేము స్వతహాగా మైనారిటీ సంస్థలు,  ప్రత్యేకంగా మదరసాలను చూశాము. క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లో చదువుతున్న 74 శాతం మంది విద్యార్థులు మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు కాదని మాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి”అని ఆమె చెప్పారు.

“చాలా పాఠశాలలు, మైనారిటీ సంస్థలుగా నమోదు చేసుకున్నాయి, ఎందుకంటే ఆ విధంగా చేస్తే ఆర్టీఇ చట్టంను అమలు చేయనవసరం లేదు. ఆర్టికల్ 30, సాంస్కృతిక భాషా, మతపరమైన రక్షణ కోసం మైనారిటీలకు తమ స్వంత సంస్థలను తెరిచే హక్కును నిర్ధారిస్తుంది, ఆర్టికల్ 21 (ఎ) లో ఉన్నది విద్యాహక్కు ప్రాథమిక హక్కును కాపాడుతుంది. ఖచ్చితంగా ఆర్టికల్ 21 (ఎ) తప్పనిసరిగా ప్రబలంగా ఉండాలి, ’’ అని ఆమె స్పష్టం చేశారు.

“ఈ మినహాయింపును సమీక్షించాల్సిన అవసరం ఉంది,” అని ప్రియాంక స్పష్టం చేశారు. ఇది మైనారిటీ వర్గాలకు చెందిన వెనుకబడిన పిల్లలకు ఈ సంస్థలలో విద్యను కోల్పోయేటట్లు చేస్తున్నదని ఈ నివేదిక తెలిపింది.  “ఈ నివేదిక ద్వారా, విద్యా హక్కు, సర్వశిక్షా అభియాన్ మదరసాలతో సహా అన్ని మైనారిటీ పాఠశాలలకు విస్తరించాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది” అని ఆమె తెలిపారు. 

 
ఎన్‌సిపిసిఆర్ నివేదిక ప్రకారం, మైనారిటీ పాఠశాలల్లో 8.76 శాతం మంది విద్యార్థులు మాత్రమే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యానికి చెందినవారు. “మైనారిటీ పాఠశాలలు ఆర్టీఇ చట్టం పరిధికి వెలుపల ఉన్నందున, వెనుకబడిన నేపథ్యాల నుండి విద్యార్థులను చేర్చుకోవలసిన అవసరం లేదు,” అని వెల్లడి చేస్తుంది. 

మతాల వారీగా పాఠశాలలను చూస్తే, భారతదేశంలోని మైనారిటీ జనాభాలో క్రైస్తవులు 11.54 శాతం మంది ఉండగా, వారు 71.96 శాతం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. 69.18 శాతం మైనారిటీ జనాభా ఉన్న ముస్లింలు 22.75 శాతం పాఠశాలలను నిర్వహిస్తున్నారు.

సిక్కులు మైనారిటీ జనాభాలో 9.78 శాతం ఉన్నారు. కానీ 1.54 శాతం పాఠశాలలను మాత్రమే నిర్వహిస్తున్నారు; 3.83 శాతం మైనారిటీ జనాభా ఉన్న బౌద్ధులు 0.48 శాతం పాఠశాలలను నిర్వహిస్తున్నారు.  1.9 శాతం మైనారిటీ జనాభా కలిగిన జైనులు 1.56 శాతం పాఠశాలలను నిర్వహిస్తున్నారు.

ఈ నివేదిక ప్రకారం, దేశంలో మూడు రకాల మదరసాలు ఉన్నాయి – 1. గుర్తింపు పొందిన మదరసాలను నమోదు చేశారు. మతపరమైన,  లౌకిక విద్యను అందిస్తాయి. 2. లౌకిక విద్య లేదా మౌలిక సదుపాయాల లేమి వంటి ఇతర కారకాలతో రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేయడంలో లోపం కారణంగా గుర్తింపబడని మదరసాలు. 3. మ్యాప్ చేయని మదరసాలు. ఇవి నమోదు కావడానికి ఎన్నడూ దరఖాస్తు చేయలేదు.

ఎన్‌సిపిసిఆర్ ప్రకారం, 4 శాతం ముస్లిం పిల్లలు (15.3 లక్షలు) మదరసాలకు హాజరవుతారని చెప్పే సచార్ కమిటీ నివేదిక, నమోదిత మదరసాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది.

 
ఎన్‌సిపిసిఆర్ నివేదిక ప్రకారం శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన మదరసాల సిలబస్ ఏకరీతిగా లేదు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలియకుండా ఉండటం వలన, చాలా మంది విద్యార్థులలో న్యూనత సంక్లిష్టతను అభివృద్ధి చెందుతున్నది. మిగిలిన సమాజం నుండి దూరంగా ఉంటూ ఉండడంతో పరిసరాలతో సర్దుబాటు చేఉస్కోలేక పోతున్నారు. మదరసాలకు ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలు లేవని కూడా ఇది చెబుతోంది.

ఈ నివేదిక మైనారిటీ విద్యాసంస్థల స్థాపనను విభజించడం,  పాలించడం అనే వలసవాద విధానాన్ని గుర్తించింది. “1947 కి ముందు స్థాపించిన మైనారిటీ పాఠశాలలు భారత ప్రజలను ఆర్థిక, మత, సామాజిక,  రాజకీయ వ్యత్యాసాల ఆధారంగా  విభజించడానికి ప్రయత్నించిన బ్రిటీషర్లు అనుసరించిన విభజించి, పాలించు విధానాన్ని ప్రతిబింబిస్తాయి” అని ఇది చెప్పింది.

 
 17 వ వైస్రాయ్ భారతీయ కౌన్సిల్స్ చట్టం 1909 లో భాగంగా (సాధారణంగా మోర్లే మింటో సంస్కరణలు అని పిలుస్తారు) హిందువులు, ముస్లింల మధ్య చీలికను సృష్టించడానికి ప్రత్యేక ఓటర్ల ఏర్పాటును ప్రవేశపెట్టినప్పుడు దీనిని ప్రవేశపెట్టారు.  తద్వారా మతపరమైన అసమ్మతిని ప్రోత్సహించారని నివేదిక గుర్తు చేసింది. 
 
2006 లో 93 వ రాజ్యాంగ సవరణ తర్వాత మైనారిటీ స్టేటస్ సర్టిఫికెట్ పొందే పాఠశాలల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని నివేదిక తెలిపింది. 2005-2009 సంవత్సరాలలో మొత్తం పాఠశాలల్లో 85 శాతం కంటే ఎక్కువ పాఠశాలలు సర్టిఫికేట్ పొందాయని గుర్తించింది. 2010 సొసైటీ తీర్పు తర్వాత 2010-14లో రెండవ ఉప్పెన కనిపించింది, ఇది ఆర్టిఇ చట్టం, 2009 లోని సెక్షన్ 12 (1) (సి),  18 (3) అన్‌ఎయిడెడ్ మైనారిటీ పాఠశాలలకు వర్తించదు. 2014 లో, ప్రమతి తీర్పు మైనారిటీ పాఠశాలలకు మొత్తం ఆర్టిఇ చట్టం వర్తించకుండా చేసింది.

ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్‌లో, మైనారిటీ జనాభాలో 92.47% ముస్లింలు, 2.47% మంది క్రైస్తవులు కాగా,  114 క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలు ఉన్నాయి. ముస్లిం మైనారిటీ హోదా కలిగిన రెండు పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా, ఉత్తర ప్రదేశ్‌లో, క్రైస్తవ జనాభా 1% కంటే తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో 197 క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలు ఉన్నాయి. ఈ అసమాన సంఖ్య మైనారిటీ విద్యా సంస్థలను స్థాపించే ప్రధాన లక్ష్యాన్ని తీసివేస్తుంది.

“పాఠశాలకు వెళ్లే వయస్సు గల వర్గాలలో మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ, మైనారిటీ పాఠశాలలు 8% కంటే తక్కువగా ఉన్నాయి. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థుల కనీస శాతం సంస్థలో ప్రవేశానికి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలను నిర్దేశించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక ప్రభుత్వంకు సిఫార్సు చేసింది.