వచ్చే ఏడాది ఆగష్టు 15కు నూతన పార్లమెంట్ భవనం 

వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 15 నాటికి నూత‌న పార్లమెంట్ భ‌వ‌నం అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా బుధ‌వారం వెల్లడించాయిరు. బ్రిటిష్ పాల‌కుల నుంచి స్వాతంత్యం ల‌భించి 75 ఏండ్లు పూర్త‌య్యే సంద‌ర్భంలో నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం సిద్ధం కానుంది. 

2022 ఆగ‌స్ఠ్ నాటికి నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం నిర్మాణ ప‌నులు ముగిసేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. వ‌ర్షాకాల స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన అనంత‌రం ఓం బిర్లా విలేక‌రుల‌తో మాట్లాడారు.   పెగాస‌స్‌, వ్య‌వ‌సాయ చ‌ట్టాలు స‌హా ప‌లు అంశాల‌పై విప‌క్షాల నిర‌స‌న‌ల న‌డుమ స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం చెల‌రేగిన సంగ‌తి తెలిసిం దే.

లోక్‌స‌భలో ప‌రిణామాలు త‌న‌ను బాధించాయ‌ని స్పీక‌ర్ ఓంబిర్లా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వీలైనంత వ‌ర‌కు స‌భా కార్య‌క్ర‌మాలు జ‌రిగే విధంగా చూసిన‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు చెప్పారు. కానీ విప‌క్షాలు స‌భా కార్య‌క్ర‌మాల‌ను నిత్యం అడ్డుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 

గ‌త రెండేళ్ల నుంచి స‌భ‌లో గ‌రిష్ట స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలిపారు. ఈసారి 20 బిల్లులు పాసైన‌ట్లు స్పీక‌ర్ బిర్లా చెప్పారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీల స‌భ్యులు స‌హ‌క‌రించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన నేప‌థ్యంలో ప్ర‌గ‌తి స‌మీక్ష అవ‌స‌ర‌మ‌ని ఆయ‌నసూచించారు. 

వ‌ర్షాకాల పార్ల‌మెంట్‌లో భాగంగా జూలై 19న ప్రారంభ‌మైన లోక్‌స‌భ‌.. రెండు రోజుల ముందే నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. ఈసారి 74 గంట‌ల 46 నిమిషాల పాటు లోక్‌స‌భ జ‌రిగిన‌ట్లు స్పీక‌ర్ వెల్ల‌డించారు. స‌భ కేవ‌లం 21 గంట‌లే స‌జావుగా న‌డిచింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక స‌మావేశాల్లో ఓబీసీ బిల్లు స‌హా 20 బిల్లులు స‌భ ఆమోదం పొందాయి