దళితులపై కామెంట్స్ చేసిన నటి అరెస్ట్

తమిళ వర్ధమాన నటి, బిగ్‌ బాస్‌ ఫేం మీరా మిథున్‌ను చెన్నై పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. సినిమా రంగం నుంచి షెడ్యూల్‌ కులాలకు చెందిన దర్శకులు, నటులను గెంటేయాలంటూ ఆమె ఓ వీడియోను ఈనెల 7న ట్వీట్‌ చేయడం కలకం రేపింది. ఓ దర్శకుడు తన అనుమతి అనుమతి లేకుండా తన ఫోటోను సినిమా ఫస్ట్ లుక్ కోసం ఉపయోగించాడని ఆరోపిస్తూ షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా అవమానకరమైన పదాలను ఉపయోగించింది.  
 
షెడ్యూల్డ్ కులాలకు చెందిన ద‌ర్శ‌కులు, న‌టీనటుల వ‌ల‌నే సినీ ఇండ‌స్ట్రీలో మంచి సినిమాలు రావ‌డం లేద‌ని, వారిని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్ల‌గొట్టాలంటూ కామెంట్స్ చేసింది. పరిశ్రమలోని షెడ్యూల్డ్ కులాల వాళ్లకు అనేక నేరాలకు సంబంధం ఉందని కూడా చెప్పడంతో ద‌ళిత సంఘాలు మీరా మిథున్‌పై మండిప‌డుతున్నాయి.
 
దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం ఆమె  దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను శనివారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇది కాస్త వైరల్‌ కావడంతో మీరా మిథున్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా నెటిజనులు డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ సెక్షన్ల కింద కేసులో అరెస్ట్‌ చేశారు.
 
ఈ వివాదంపై స్పందించిన వీసీకే చీఫ్, ఎంపీ తోల్ తిరుమావళవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మీరా మిథున్ ఇంటర్వ్యూయర్‌ని  పోస్ట్ చేస్తూ  క్యాప్షన్‌లో, ఎస్‌సి/ఎస్‌టి అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఇద్దరిని అరెస్టు చేయమని ఆయన కోరారు. ఇంకా, మీరా మిథున్‌ను అరెస్ట్ చేయమని కోరుతూ ద్రవిడార్ లిబరేషన్ ఆర్గనైజేషన్ జిల్లా కార్యదర్శి ఎంపీ మణి అముథన్ తరపున మధురై మునిసిపల్ పోలీస్ కమిషనర్ ప్రేమ్ ఆనంద్ సిన్హా కు ఫిర్యాదు చేశారు.