ప‌న్ను చెల్లింపు దారుల ఫిర్యాదులకు మూడు ఈ-మెయిల్ ఐడీలు

ఐటీ రిటర్న్స్ దాఖ‌లు చేసే ప‌న్ను చెల్లింపు దారులు త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలిపేందుకు ఆదాయం ప‌న్ను (ఐటీ) శాఖ మూడు అధికారిక ఈ-మెయిల్ ఐడీల‌ను నోటిఫై చేసింది. ఫేస్‌లెస్ లేదా ఈ-అసెస్‌మెంట్ స్కీమ్ కింద ఫిర్యాదులు చేయ‌డానికి వీటిని నోటిఫై చేసిన‌ట్లు  ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపింది.

టాక్స్ పేయర్స్ చార్ట‌ర్‌లో ప‌న్ను చెల్లింపుదారుల‌కు మెరుగైన సేవ‌లందించే ల‌క్ష్యంతో ఐటీ రిట‌ర్న్స్ మూడు ఈ-మెయిల్ ఐడీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొంది. ఫేస్‌లెస్ స్కీం కింద ప‌న్ను చెల్లింపులకు సంబంధించి పెండింగ్ కేసుల ప‌రిష్కారం, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ఫిర్యాదు చేసేందుకు ఈ-మెయిల్ ఐడీల‌ను క్రియేట్ చేశాం అని తెలిపింది.

ప‌న్ను చెల్లింపు దారులు ఎదుర్కొనే ప‌లు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి “For faceless assessments: samadhan.faceless.assessment@incometax.gov.in; For faceless penalty: samadhan.faceless. penalty @incometax.gov.in; For faceless appeals: samadhan.faceless.appeal@incometax.gov.in, “
అనే ఈ-మెయిల్స్ కు ఫిర్యాదు చేయొచ్చు.

ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ స్కీం కింద ప‌న్ను చెల్లింపు దారు త‌మ ఆదాయం ప‌న్ను సంబంధ లావాదేవీల‌పై చ‌ర్చించ‌డానికి, ఫిర్యాదు చేయ‌డానికి ఐటీ శాఖ కార్యాల‌యానికి రావాల్సిన అవ‌స‌రం లేదు.