బాక్స‌ర్ లవ్లీనాకు రజిత పతాకం

ఒలింపిక్స్‌లో భారత బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహైన్ ) సంచ‌ల‌నాల‌కు తెర‌ప‌డింది. బుధ‌వారం 64-69 కేజీల విభాగంలో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ట‌ర్కీ బాక్స‌ర్ బుసెనాజ్ సూర్మ‌నెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది.
 
మూడు రౌండ్ల‌లోనూ ట‌ర్కీ బాక్స‌ర్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఐదుగురు జ‌డ్జీలు ఏక‌గ్రీవంగా ఆమెనే విజేత‌గా తేల్చారు. 
ఈ ఓట‌మితో ల‌వ్లీనా  రజిత పతాకంతో స‌రిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ 23 ఏళ్ళ అస్సాం బాలిక  ఒలింపిక్స్ బాక్సింగ్‌లో భారత్ కు మూడో పతాకం తీసుకు వచ్చారు.
 
 గతంలో 2008లో విజేందర్‌, 2012లో మేరీకోమ్‌ కూడా భారత్‌కు రజిత పతాకాలు గెలుపొందారు.  ఈ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్  గెలిచిన మూడో పతాకం ఇది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సిల్వ‌ర్‌, బ్యాడ్మింట‌న్‌లో సింధు రజిత పతాకాలు గెలుపొందగా,  ఇప్పుడు బాక్సింగ్‌లో ల‌వ్లీనా బోర్గోహైన్ మ‌రో రజిత పతాకం తీసుకొచ్చింది.
 
బాక్సింగ్ విభాగంలో భారత్‌కు లవ్లీనా 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకాన్ని అందించడం విశేషం. దీంతో అభిమానులు ఆమె సాధించిన కాంస్యాన్ని కూడా స్వర్ణంతో సమానం అని ప్రశంసిస్తున్నారు.  మొత్తంగా మేరీ కోమ్ తర్వాత బాక్సింగ్‌లో పతకం అందించిన మహిళగా నిలిచింది. మరోవైపు ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన తొలిసారే పతకం సాధించడం విశేషం.
 
ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్‌కు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ అభినందనలు తెలిపారు. లవ్లీనా దేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు. ఆమె సాధించిన ఒలింపిక్‌ మోడల్‌ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా యువతులు సవాళ్లను ఎదుర్కొనేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు స్ఫూర్తినిస్తుందంటూ ట్వీట్‌ చేశారు.
 
మరో పతాకం ఖాయం చేసిన రెజ్ల‌ర్ ద‌హియా
 
ఇలా ఉండగా, భారత్ కు మ‌రో మెడ‌ల్ ఖాయం చేశాడు రెజ్ల‌ర్ ర‌వికుమార్ ద‌హియా. బుధ‌వారం జ‌రిగిన‌ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్ స‌న‌యేవ్‌పై అత‌డు గెలిచాడు. విక్ట‌రీ బై ఫాల్‌గా అత‌న్ని విజేత‌గా ప్ర‌క‌టించారు. ఈ విజ‌యంతో ఫైన‌ల్లో అడుగుపెట్టిన ర‌వికుమార్‌..కనీసం క‌నీసం రజిత పతాకంఖాయం చేయ‌డం విశేషం.
 
ఇప్ప‌టి వ‌ర‌కూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్‌, యోగేశ్వ‌ర్‌ద‌త్‌లు మాత్ర‌మే భారత్ కు రజిత పతాకాలు అందించారు. వాళ్ల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన మూడో రెజ్ల‌ర్‌గా ర‌వికుమార్ ద‌హియా నిలిచాడు. బుధ‌వారం ఉద‌యం నుంచి ర‌వికుమార్ మొత్తం బౌట్లు గెలిచి మెడ‌ల్ ఖాయం చేయ‌డం విశేషం. 
 
సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమ‌యంలో ర‌వికుమార్ అత‌న్ని రింగ్ బ‌య‌ట‌కు తోసే క్ర‌మంలో నూరిస్లామ్ కాలికి గాయ‌మైంది. కాలికి క‌ట్టుకొని మ‌ళ్లీ రింగులోకి వ‌చ్చినా.. అత‌డు ర‌వికుమార్ ప‌ట్టుకు నిలవ‌లేక‌పోయాడు. దీంతో రిఫ‌రీ ర‌వికుమార్‌ను విక్ట‌రీ బై ఫాల్ కింది విజేత‌గా ప్ర‌క‌టించాడు.