భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఇండియన్ జట్టు ప్రవేశించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో గెలిచిన ఇండియా.. సెమీస్‌లో అర్జెంటీనాతో తలపడనున్నది. ఆట రెండవ అర్థభాగంలో గుర్జిత్ కౌర్ అద్భుతమైన గోల్ చేసింది.
అయితే ఆట మొత్తం లీడింగ్‌లో ఉన్న ఇండియా.. ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో సెమీస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సారి మహిళల జట్టు నాకౌట్ దశలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.
పూల్ ఏ లో ఇండియన్ జట్టు నాలుగవ స్థానంలో నిలిచింది. గ్రూపు స్టేజ్‌లో రెండు విజయాలు, మూడు పరాజయాలను నమోదు చేసింది. అయితే ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నిజానికి ఆస్ట్రేలియానే ఫెవరేట్. వరల్డ్ నెంబర్ టూ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను ఇండియా మట్టికరిపించిన తీరు ప్రశంసనీయం. హాకీలో నెదర్లాండ్స్ ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది.
రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టు.. గ్రూప్ బీ టాపర్స్ ఆస్ట్రేలియాను అనూహ్య రీతిలో ఓడించింది. 22వ నిమిషంలో గుర్జిత్ కౌర్ భారత్ తరపున ఏకైక గోల్స్ చేసింది. ఆస్ట్రేలియా జోరుకు భారత మహిళలు ఏమాత్రం బెదరలేదు. ప్రత్యర్థుల్ని డిఫెన్స్‌లో పడేశారు.
గ్రేస్ ఎక్కా రక్షణ వలయాన్ని ఆస్ట్రేలియా చేధించలేకపోయింది. దీంతో ఆస్ట్రేలియాపై వత్తిడి పెరిగింది. అడపాదడపా ఆసీస్ దూకుడు ప్రదర్శించినా.. భారత జట్టు ధీటుగా ఎదుర్కొన్నది. గుర్జీత్ డ్రాగ్ ఫ్లిక్ షాట్‌తో 22వ నిమిషంలో ఇండియాకు కలిసి వచ్చింది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో బోలడన్ని పెనాల్టీ కార్నర్లు తీసుకున్నది. సర్కిల్‌లో చుట్టుముట్టింది. గోల్ పోస్టుపై ఇండియా కన్నా ఎక్కువ షాట్స్ ఆడింది. కానీ భారత మహిళలు మాత్రం ఆసీస్‌కు ఎక్కడా తలొగ్గలేదు.
థార్డ్ క్వార్టర్స్‌లో ఆసీస్ జోరు పెంచినా.. రాణి రాంపాల్ బృందం ధైర్యంగా వారిని అడ్డుకున్నది. రియో ఒలింపిక్స్‌లో ఇదే ఆస్ట్రేలియా జట్టుతో 6-1తో ఓడి సెమీస్ ఆశలు చేర్చుకున్న భారత జట్టు ఈసారి ఫలితాన్ని తిరగరాయడం అద్భుతం.
More Stories
జన్మతః పౌరసత్వం రద్దుపై ఫెడరల్ కోర్టు స్టే
అండర్-19 ప్రపంచకప్.. సూపర్ సిక్స్‌లోకి యువ భారత్
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం