ఆక్రమిత కాశ్మీర్ లో ఆదివారం ఎన్నికలు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. దాని అసెంబ్లీలో 53 సీట్లు ఉన్నాయి.  వాటిలో నాలుగు స్థానాలను 2019 లో చేర్చారు. 700 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు.  సుమారు 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పాకిస్తానీయులు “ఆజాద్ జమ్మూ, కాశ్మీర్” (సంక్షిప్తంగా “ఎజికె”) అని పిలిచే పీఓకే 1947లో కాశ్మీర్ యుద్ధం తరువాత భారత్ – పాక్ ల మధ్య విరమణ జరిగినప్పుడు ఉనికిలోనికి వచ్చింది. అప్పటివరకు   జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమణలోకి వెళ్లాయి. 
 
పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం పీఓకే ఆ దేశంలో భాగం కాదు. కేవలం కాశ్మీర్ లో “విముక్తి పొందిన” భాగం మాత్రమే. కానీ భారత్ లో అంతర్భాగమని మన పార్లమెంట్ స్పష్టం చేసింది. పీఓకేకు జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీలో, భారత్ పార్లమెంట్ లో కొన్ని సీట్లు రిజర్వు చేసి ఉంచినా, ఇప్పటి వరకు ఇకసారి కూడా వాటిని భర్తీ చేయలేదు.

ఏది ఏమయినప్పటికీ, పాకిస్తాన్ భూభాగాలను జాబితా చేసే రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 లో, “అటువంటి రాష్ట్రాలు, భూభాగాలు పాకిస్తాన్లోన్ లో విలీనం ద్వారా లేదా ఇతరత్రా చేర్చవచ్చు” అనే నిబంధన కూడా ఉంది. పాకిస్తాన్ రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ గురించి ఒక ప్రత్యక్ష సూచన ఆర్టికల్ 257 లో ఉంది: “జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు పాకిస్తాన్‌ మీ  అంగీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు, పాకిస్తాన్, ఆ  రాష్ట్రం మధ్య సంబంధాలు నిర్ణయించబడతాయి”.

పీఓకే భూభాగం మీర్పూర్, ముజఫరాబాద్, పూంచ్ అనే మూడు విభాగాల క్రింద 10 జిల్లాలను కలిగి ఉంది. దాని రాజధాని ముజఫరాబాద్. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అదొక్క స్వయంప్రతిపత్తి, స్వపరిపాలన గల భూభాగం. అయితే ఆచరణలో మొత్తం పాకిస్థాన్ సైన్యం ఆధీనంలో ఉంది. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో  ఉగ్రవాదుల కోసం అనేక శిక్షణా శిబిరాలు పీఓకేలో ఉండెడివి.


“జమ్మూ కాశ్మీర్ తమ దేశంలో విలీనంకు సంబంధించి తమ దేశపు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తులు లేదా రాజకీయ పార్టీలపై పీఓకే రాజ్యాంగం స్పష్టమైన నిషేధాన్ని విధించింది. అటువంటి వారు ఆ ప్రాంత అసెంబ్లీకి వెళ్ళడానికి అనర్హులు. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కాశ్మీర్ పాకిస్థాన్ లో విలీనం కావలసిందే అనే ప్రమాణపత్రంపై సంతకం చేయవలసిందే. 
 
పాకిస్తాన్ ప్రధాన మంత్రి నేతృత్వంలోని 14 మంది సభ్యుల నామినేటెడ్ సంస్థ అయిన సర్వాధికారాలు గల కాశ్మీర్ కౌన్సిల్ ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే లో పాలనను నిర్వహిస్తుంది. ఆరుగురు సభ్యులను పాకిస్తాన్ ప్రభుత్వం నామినేట్ చేసింది మిగిలిన ఎనిమిది మంది “ఆజాద్ కాశ్మీర్” “ప్రధాన మంత్రి” తో సహా పీఓకే అసెంబ్లీ, ప్రభుత్వానికి చెందినవారు ఉంటారు.

పీఓకేలో మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నికలు 1970 లో జరిగాయి. 1974 లో దాని స్వంత “మధ్యంతర” రాజ్యాంగం అమలులోకి వచ్చింది (కాశ్మీర్ సమస్య తుది పరిష్కారం పెండింగ్‌లో ఉంది), అదే సంవత్సరంలో పాకిస్తాన్‌కు మొదటి పూర్తి స్థాయి రాజ్యాంగం లభించింది.

అసెంబ్లీలోని 53 సీట్లలో నలభై ఐదు నేరుగా ఎన్నుకోబడిన సభ్యుల కోసం – 33 నియోజకవర్గాలకు చెందినవి కాగా, 12 పాకిస్తాన్ లోగల నాలుగు రాష్ట్రాలలోని “శరణార్థుల నియోజకవర్గాలు”.  1947 లో భారతదేశం నుండి పాకిస్థాన్ కు వలస వచ్చిన వారిని సూచిస్తుంది. అసెంబ్లీలో మిగిలిన ఎనిమిది సీట్లు నామినేషన్ ద్వారా నింపుతారు.


పీఓకెలో ఎన్నికలలో పోటీలో ఉన్న పార్టీలు,  పోటీదారులు పాకిస్తాన్ రాజకీయాలకు అద్దం పడుతుంటారు. గెలిచిన పార్టీ సాధారణంగా ఇస్లామాబాద్‌లో అధికార పార్టీ వారే ఉంటారు. ఇస్లామాబాద్‌లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధికారంలో ఉన్నప్పుడు 2016 లో పీఓకేలో  చివరి ఎన్నికలు జరిగాయి. పిఎంఎల్ (ఎన్) సులభంగా మెజారిటీని గెలుచుకుంది.  రాజా ఫరూక్ హైదర్ “ఆజాద్ కాశ్మీర్”  ప్రధాన మంత్రిగా, మసూద్ ఖాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఈ నమూనాకు అనుగుణంగా, 2018 లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్  పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రస్తుత ఎన్నికలలో విజయం సాధిస్తుందని విస్తృతంగా భావిస్తున్నారు. అయితే, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం ప్రసంగించిన పిఎంఎల్ (ఎన్) ర్యాలీలు భారీగా జనాన్ని ఆకర్షిస్తున్నాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావాల్ భుట్టో జర్దారీ కూడా అనేక ర్యాలీలలో ప్రసంగించారు.

 
ప్రతి ఎన్నికల ప్రచారంలో, కాశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులే ప్రధాన అంశాలుగా ఉంటూ వస్తున్నా, ఇస్లామాబాద్, ముజఫరాబాద్ లలో అధికార పార్టీ పాలనా అంశాలను కూడా ప్రస్తావనకు వస్తాయి. 

కాశ్మీర్‌లో భద్రతా దళాలు మిలిటెంట్ నాయకుడు బుర్హాన్ వానిని హత్య చేసిన కొన్ని రోజుల తరువాత గత చివరి ఎన్నికలు జరిగాయి. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, అప్పుడు పనామా పేపర్స్ కేసు,  ఇతర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఒక ఏడాది తర్వాత న్యాయవ్యవస్థ అతనిని తొలగించింది. 
 
వానిని “అమరవీరుడు” గా పేర్కొంటూ,  భారత దళాలు మానవ హక్కుల ఉల్లంఘనలు పాల్పడుతున్నట్లు ఆరోపణలు గుప్పించారు.   కాశ్మీర్ లోయ ప్రజలకు సంఘీభావంగా ఎన్నికల రోజును “బ్లాక్ డే” గా ప్రకటించారు. కాశ్మీరీల “స్వీయ-నిర్ణయం కోసం పోరాటం” కు తన పార్టీ, ప్రభుత్వ మద్దతును ప్రకటించారు.

ఈ సారి ఎన్నికలలో  2019 ఆగస్టు 5 న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న చర్యలని ప్రధాన ఎన్నికల అంశాలుగా ప్రచారం చేస్తున్నారు.  తమ ప్రచార ప్రసంగాల్లో, మరియమ్ నవాజ్, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కాశ్మీర్‌లో భారత చర్యలకు చట్టబద్ధత ఇచ్చిందని ఆరోపించారు. మరోవంక, పీఓకేను పాకిస్థాన్ లో ఒక రాష్ట్రంగా మార్చాలనే ప్రణాళికను ఇమ్రాన్ ఖాన్ రహస్యంగా ప్రవేశపెట్టారని, అందుకోసం ఇక్కడ ఒక “కీలుబొమ్మ ప్రధాని” కోసం చూస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.