అభివృద్ధి పేరిట ఏమీ జరగలేడనై, కేవలం కులతత్వం, స్వపక్షం, అవినీతికి కేంద్రంగా ఆ ప్రభుత్వం మారినదని గుర్తు చేశారు. అయితే నాలుగు సంవత్సరాలలో, యు, పి, దేశంలోని ప్రముఖ రాష్ట్రాలలో ఒకటిగా మార్చగలిగిన్నట్లు నేడు మనం గర్వంగా చెప్పగలుగుతున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఉత్తర ప్రదేశ్ ఒకప్పుడు “బిమరు” గా ఉండేది, ఇప్పుడు ఇది వ్యాపారం చేయడం సులభం అనే ప్రఖ్యాతి పొందుతున్నది. గతంలో కర్ఫ్యూ అనేది ఒక సాధారణ విషయంగా ఉండెడిది, కానీ అయితే బిజెపి ప్రభుత్వ హయాంలో ఒక్క అల్లర్లు కూడా జరగలేదని నడ్డా వివరించారు.
వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజలు, రైతుల వద్దకు తీసుకెళ్లాలని బిజెపి అధ్యక్షుడు పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించారు. ఇటీవలి జిల్లా పరిషద్, పంచాయతీ ఎన్నికలలో “భారీ విజయం” సాధించినందుకు రాష్ట్ర పార్టీ యూనిట్, ప్రభుత్వం, పార్టీ కార్యకర్తలను ఆయన అభినందించారు.
“ప్రజలు ఎస్పీ, బిఎస్పిలను పూర్తిగా తిరస్కరించారు. ఇంట్లో కూర్చోమని సందేశం ఇచ్చారు” అని నడ్డా ఎద్దేవా చేశారు. “బిజెపి కార్యకర్తలు తమ శక్తితో తమ బాధ్యతలను నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ, మహమ్మారికి సిద్ధం కావడానికి సరైన సమయంలో లాక్ డౌన్ తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాన్ని బిజెపి అధ్యక్షుడు ప్రశంసించారు. దేశాన్ని అమెరికా, బ్రిటన్‌తో పోల్చి చూపుతూ ఆరోగ్య రంగంలో కొద్దీ సమయంలో మహమ్మారిని ఎదుర్కోవడానికి తీయూకొచ్చిన మార్పులను రాజకీయ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు.
“నీరు, రహదారి,వాయు రీతుల ద్వారా దేఖ్గుకి = కూర్చున్న కొంతమంది రాజకీయాలు ఆడుతున్నప్పుడు ఒక వారంలో ఆక్సిజన్ ప్రజలకు అందుబాటులో ఉంది. వారికి 400 మెట్రిక్ టన్నులు అవసరమయ్యాయి. కానీ 900 మెట్రిక్ టన్నులు అడుగుతూ కోర్టుల తలుపులు కొట్టారు” అంటూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా నడ్డా ధ్వజమెత్తారు.
ప్రపంచం మొత్తం ఈ వ్యాధుల నుండి దాదాపుగా విముక్తి పొందిన తర్వాతనే టిబి, చికెన్‌పాక్స్, పోలియో టీకాలు మన దేశంలో అందుబాటులోకి వచ్చాయని నడ్డా గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు కేవలం తొమ్మిది నెలల్లో రెండు కరోనా వ్యాక్సిన్లను తయారు చేయడానికి టాస్క్ ఫోర్స్ను సృష్టించిన ఒక ప్రధాన మంత్రి మనకు ఉన్నారని తెలిపారు.
ఇంత సంకుచుతా ఆలోచన ఉన్నవారికి రాష్ట్ర నాయకురాలిగా రాష్టానికి నాయకత్వం వహించాలని అభిలాష ఉన్నదని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలు గతంలో ఇలాంటి నాయకులకు తగిన సమాధానం ఇచ్చారని, భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు 18 ఏళ్లు పైబడిన వారందరిని టీకా తీసుకోవటానికి ప్రేరేపించాలని, దీనిని బిజెపి వ్యాక్సిన్ అని పేర్కొన్నవారికి తగిన సమాధానం ఇవ్వాలని చెప్పారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత