మూడో వేవ్ కట్టడిలో 2.5 లక్షల ప్రదేశాలకు ఆర్ఎస్ఎస్ శిక్షకులు

కరోనా మూడవ వేవ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్  సంఘ్ దేశవ్యాప్తంగా “కార్యకర్తల శిక్షణ” ను నిర్వహిస్తుంది మరియు ఈ శిక్షణ పొందిన కార్యకర్తలు దేశ వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల ప్రదేశాలకు చేరుకొని ప్రజలు అవగాహన, సహాయ కార్యక్రమాలు చేబడతారు. ఇప్పటికే దేశంలో 27,166 సంఘ్ శాఖలలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. 
 
ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ ల సమావేశంలో సంస్థాగత కార్యక్రమాలతో పాటు కరోనా రెండవ వేవ్ నుండి ఉత్పన్నమైన పరిస్థితులను విస్తృతంగా చర్చించారని సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. 
 
వివిధ ప్రాంతాలలో ఈ సందర్భంగా చేపట్టిన సేవా కార్యక్రమాలను సమీక్షించారు. సంఘ్ స్వయంసేవక్ లు నిర్వహించిన టీకాల కోసం సౌకర్యం కేంద్రాలు, ప్రజలను టీకాలు ప్రోత్సహిస్తూ చేపట్టిన ప్రచార కార్యక్రమాలను కూడా సమీక్షించారు.  రాగాల కరోనా మూడవ వేవ్ అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగంతో సహకరించడం కోసం, సంభావ్య బాధితులకు సహాయం చేయడానికి మొత్తం దేశంలో ప్రత్యేక “కార్యకర్తల శిక్షణ”ను నిర్వహించాలని ఈ సమావేశాల్లో నిర్ణయించారు. 
 
ఆ విధంగా శిక్షణ పొందిన స్వయం సేవక్ లు సమాజంలో ధైర్యాన్ని పెంచడానికి అవసరమైన సమాచారాన్ని పొంది, తగిన సమయంలో ప్రజలకు తెలియచెప్పే విధంగా 2.5 లక్షల ప్రదేశాలకు చేరుకొంటారని అంబేకర్ వివరించారు.

ఈ శిక్షణ ఆగస్టు నెలలో పూర్తవుతుంది. సెప్టెంబర్ నుండి, ప్రతి గ్రామం, నగరాలలోని `జన జాగరణ్’ (ప్రజల్లో అవగాహన) ద్వారా ఈ ప్రచారంలో ఇంకా చాలా మంది ప్రజలు, సంస్థలను అనుసంధానం కావిస్తారు. ఈ శిక్షణలో  పిల్లలు, తల్లులకు ముఖ్యంగా కరోనా నుండి నిరోధించడానికి అవసరమైన జాగ్రత్తలు, చర్యల  గురించి వివరిస్తారు.

కరోనా వ్యాప్తి తరువాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నందున, ఈ రంగంలో సంఘ శాఖలు పనిచేయడం కూడా ప్రారంభమైంది. సమావేశంలో లభించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 39,454  శాఖలు పనిచేస్తున్నాయి. వీటిలో 27,166 శాఖలు క్షేత్ర స్థాయిలో జరుగుతూ ఉండగా, 12,288  ఇ-శాఖలు జరుగుతున్నాయి.

అలాగే 10,130 వారపు శాఖలు (సా \ప్తహిక్ మిలన్) జరుగుతున్నాయి.   వీటిలో 6510 మైదానంలో జరుగుతుండగా, 3620 సమావేశాలు ఆన్‌లైన్‌లో ఇ-మిలన్‌గా జరుగుతున్నాయి. కరోనా లాక్ డౌన్  కాలంలో ప్రత్యేకంగా ప్రారంభమైన కుతుంబ్ మిలన్ (కుటుంభం సమావేశాలు) దేశవ్యాప్తంగా 9637 ఉన్నాయి.

 
జులై 9 నుండి ప్రారంభమైన సమావేశాలు ఐదు రోజులపాటు జరుగనున్నాయి. మొదటి రోజున క్షేత్ర, సహా క్షేత్ర ప్రచారక్ లు సమావేశం ప్రారంభమైనది. సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబెలే తో పాటు ఐదుగురు సహా కార్యవహ్ లు కూడా పాల్గొన్నారు. సంఘ్ లో దేశం మొత్తంలో 11 క్షేత్రాలు ఉన్నాయి. 
 
12వ తేదీన ప్రాంత ప్రచారక్ లు, సహా ప్రచారకులు సమావేశం జరుగుతున్నది. సంఘ్ కు దేశం మొత్తం మీద 45 ప్రాంత్ లు ఉన్నాయి. అందరు ఆన్ లైన్ లో సమావేశంలో పాల్గొన్నారు.  13న సంఘ్ పరివార్ సంస్థల సంఘటనా కార్యదర్శుల సమావేశంలో ఈ సమావేశాలు ముగుస్తాయి. ఈ సమావేశం కూడా ఆన్ లైన్ లోనే జరుగుతుంది.