15న చలో ప్రగతి భవన్ …. భజరంగ్ దళ్ పిలుపు

ఎఐఎంఐఎం పార్టీ రజాకార్ల ఎజెండాను అమలు చేస్తూ, 8 వ నిజాం అవతారం ఎత్తిన కేసీఆర్ ప్రభుత్వం గో హత్య నిరోధక చట్టాలను అమలు చేయకపోగా  గో భక్తులపై ఎంఐఎం గుండాలు ప్రతి నిత్యం హత్యాయత్నాలకు పాల్పడుతున్నా కాపాడాల్సిన పోలీసులు గో భక్తులపైననే అక్రమ కేసులు నమోదు చేస్తూ దారుసలాం ఫత్వాలు అమలు చేస్తూ హిందూ వ్యతిరేఖ ఎజెండాను అమలు చేస్తున్నారని భజరంగ్ దళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 

తెలంగాణాలో గోరక్తం ఏరులై పారుతూ ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 15న ఉదయం 11 గంటలకు `చలో ప్రగతి భవన్’  ఆందోళనకు భజరంగ్ దళ్ పిలుపిచ్చింది. గోమాత పూజ జరిగిన ప్రగతి భవన్ లో నయా ఖాసిం రజ్వీలు రాజ్యమేలుతున్నారని మండిపడింది. సకల దేవతలకు నిలయమైన గోమాతను రక్షించుకోవడం మనందరి కర్తవ్యమని విజ్ఞప్తి చేసింది.

గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గో అక్రమ రవాణాదారులపై పి.డి యాక్టు నమోదు చేయాలని, బక్రీద్ కోసం వధించడానికి పాత పట్టణంలో ఉంచిన పశు సంపదను వెంటనే కాపాడాలని, జాతీయ రహదారులపై కేంద్ర బలగాల సహకారంతో శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

గోరక్షకులపై జరిగిన హత్యాయత్నాలపై నింధితులను వెంటనే అరెస్టు చేయాలని, గో అక్రమ రవాణా దారులతో కుమ్మక్కైన పోలీసు మరియు పశు వైద్యులను డిస్మిస్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, గోరక్ష కోసం ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని, రాష్ట్రంలోని గోవధ శాలలు మూసి వేయాలని భజరంగ్ దళ్ డిమాండ్ చేసింది.

ఈ  డిమాండ్లతో చేపట్టిన `చలో ప్రగతి భవన్’ కార్యక్రమానికి యావత్ హిందూ సమాజం పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపిచ్చింది, మన దేశాన్ని-ధర్మాన్ని రక్షించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున గోభక్తులు తరలిరావాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ఎం సుభాష్ చందర్ విజ్ఞప్తి చేశారు.