డీలిమిటేషన్‌ కమిటీ కాశీర్ లోయలో నేడే!

జమ్ముకాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై జెకె డీలిమిటేషన్‌ కమిటీ ఆహ్వానాన్ని స్థానిక రాజకీయ పార్టీలు, పాలనా విభాగాలు అంగీకరించాయి. జస్టిస్‌ రంజనా ప్రకాష్‌ దేశాయ్  నేతృత్వంలోని ఈ కమిటీ బుధవారం కాశ్మీర్‌ లోయలో పర్యటించనుంది. 
 
అయితే పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కమిటీ నిర్వహించే పునర్విభజన ప్రక్రియలో భాగస్వామ్యమయ్యేందుకు తాము సిద్ధంగా లేమని ప్రకటించారు. ప్రధాని మోదీ  ప్రణాళికను అనుసరించే కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని, దీంతో ప్రజల దృష్టిలో రాజకీయ పార్టీల విలువ దిగజారుతుందని పేర్కొన్నారు. 
 
అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌, మొహ్మద్‌ షఫీ, మియాన్‌ అల్తాఫ్‌ అహ్మద్‌, నాసిర్‌ అస్లాం వాని, సకినా ఇట్టులతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం జెకె డీలిమిటేషన్‌ కమిటీతో సమావేశమవుతుందని ప్రకటించారు. బిఎస్‌పి, వామపక్షాలు కూడా ఈ కమిటీతో సమావేశం కానున్నాయి. 
 
పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నుండి నలుగురు సభ్యులు, బిజెపి నుండి నలుగురు, జెకె అప్నీ పార్టీ నుండి ఐదుగురు, అలాగే కాంగ్రెస్‌ నుండి ఆరుగురు కమిటీతో సమావేశమవుతారని తెలిపాయి. ఆ బృందం కమిటీకి తెలుపుతుందని చెప్పారు.