43 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం…క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి 

కేంద్రంలో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలిసారి కేబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భారీ మార్పులు, చేర్పులు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా ఏకంగా 43 మంత్రులు బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.
 
 సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ 43 మందిలో కొంద‌రు ఇప్ప‌టికే ఉన్న మంత్రుల‌కు కొత్త శాఖ‌లు, ప్ర‌మోష‌న్లు ఉండ‌గా.. మ‌రికొంద‌రు తొలిసారి కేబినెట్‌లోకి వ‌స్తున్నారు.
  1. నారాయ‌ణ్ రాణె,  2. స‌ర్బానంద సోనోవాల్‌, 3. డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్‌,4. జ్యోతిరాదిత్య సింధియా, 5. రామ్‌చంద్ర ప్ర‌సాద్ సింగ్‌, 6. అశ్విని వైష్ణ‌వ్‌, 7. ప‌శుప‌తి కుమార్ ప‌రాస్‌. 8. కిర‌ణ్ రిజిజు, 9. రాజ్‌కుమార్ సింగ్‌,  10. హ‌ర్‌దీప్ సింగ్ పూరి
  2. 11. మన్సుఖ్ మాండ‌వీయ‌, 12. భూపేంద‌ర్ యాద‌వ్‌, 13. ప‌ర్‌షోత్త‌మ్ రూపాలా, 14. కిష‌న్ రెడ్డి, 15. అనురాగ్ సింగ్ ఠాకూర్‌, 16. పంక‌జ్ చౌద‌రి, 17. అనుప్రియా సింగ్ ప‌టేల్‌, 18. స‌త్య‌పాల్ సింగ్ బాఘెల్‌, 19. రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌, 20. శోభా క‌రాండ్ల‌జె
  3. 21. భానుప్ర‌తాప్ సింగ్ వ‌ర్మ‌, 22. ద‌ర్శ‌న విక్ర‌మ్ జర్దోష్‌, 23. మీనాక్షి లేఖి, 24. అన్న‌పూర్ణ దేవి, 25. నారాయ‌ణ‌స్వామి, 26. కౌష‌ల్ కిశోర్‌, 27. అజ‌య్ భ‌ట్‌, 28. బీఎల్ వ‌ర్మ‌, 29 అజ‌య్ కుమార్‌, 30. చౌహాన్ దేవ్‌సిన్హ్‌
  4. 31. భ‌గవ‌త్ ఖూబా, 32. క‌పిల్ మోరేశ్వ‌ర్ పాటిల్‌, 33. ప్ర‌తిమా భౌమిక్‌, 34. సుభాష్ స‌ర్కార్‌, 35. భ‌గ్‌వ‌త్ కిష‌న్‌రావ్ క‌రాడ్‌, 36. రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్‌, 37. భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్‌, 38. బిశ్వేశ్వ‌ర్ తుడు, 39. శాంత‌ను ఠాకూర్‌, 40. ముంజ‌పార మ‌హేంద్ర‌భాయి, 41. జాన్ బార్లా, 42. ఎల్‌. మురుగన్‌, 43. నితీశ్ ప్ర‌మాణిక్‌   రాష్ట్రాల్లో మంత్రులుగా చేసిన 18 మందికి కేంద్ర క్యాబినెట్‌లో చోటు ద‌క్క‌నున్న‌ది. మూడుసార్లు ఎంపీలుగా గెలిచిన‌వారు 23 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. 46 మంది మంత్రుల‌కు కేంద్ర ప్ర‌భుత్వంతో ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న‌ది.
కొత్త క్యాబినెట్‌లో 13 మంది లాయ‌ర్లు ఉడ‌నున్నారు. ఆరుగురు డాక్ట‌ర్లు, అయిదుగురు ఇంజినీర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో ఏడు మంది మాజీ ఐఏఎస్‌లు ఉంటారు. ఇవాళ ప్ర‌మాణం చేయ‌నున్న 43 మందిలో 31 మంది ఉన్నత విద్య‌ను అభ్య‌సించిన‌వారే. అయితే కొత్త క్యాబినెట్ స‌గ‌టు వ‌య‌సు 58 ఏళ్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 14 మంది మంత్రులు వ‌య‌సు 50 క‌న్నా త‌క్కువే ఉండ‌నున్న‌ది. 11 మంది మ‌హిళా మంత్రుల‌కు కూడా అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
మైనార్టీ వ‌ర్గానికి చెందిన అయిదుగురికి క్యాబినెట్ హోదా ద‌క్క‌నున్న‌ది. ఒక‌రు ముస్లిం, ఒక‌రు సిక్కు, ఒక‌రు క్రిస్టియ‌న్‌, ఇద్ద‌రు బౌద్ద మ‌త‌స్తులు ఉండ‌నున్నారు. ఓబీసీ వ‌ర్గానికి చెందిన వారు 27 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంట్లో అయిదుగురికి క్యాబినెట్ హోదా ద‌క్కుతుంది. 8 మంది ఎస్టీల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. దీంట్లో ముగ్గురికి క్యాబినెట్ హోదా ద‌క్కుతుంది. గోండు, సంత‌ల్‌, మిజీ, ముండా, టీ ట్రైబ్‌, కొంక‌నా, సోనావాల్ తెగ‌ల‌వారుంటారు.