కేంద్ర మంత్రివర్గం విస్తరణకు కొద్దిసేపటికి ముందుగా సుమారు 12మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో సీనియర్లు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజీనామాల సంఖ్య 12కు చేరింది. వీరందరి రాజీనామాలకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 12 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినట్లు స్పష్టమైనది. ఈ మేరకు పలువురు మంత్రులు రాజీనామా చేశారు.
వీరిలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్, విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దేవశ్రీ చౌదరి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి సంజయ్ ధోత్రే, కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియోలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

More Stories
ప్రభుత్వ విధానాలతోనే పశ్చిమాసియా సంక్షోభం నుండి గట్టెక్కాం
అయోధ్యలో విరాళాల చోరీపై మోహన్ భగవత్ `రామ్-రామ్’
బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య రాజీనామా