చిన్నారుల్లోని రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తున్న మాస్కులు 

మాస్కులు, భౌతిక దూరం కోవిడ్‌ సోకకుండా రక్షణ కల్పిస్తాయని తెలుసు కానీ, ఇవే చిన్నారుల్లోని రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయని చెబుతున్నారు.  ఇంగ్లాండ్‌లోని నిపుణులు చెబుతున్న ప్రకారం కరోనా మొదలైన నుండి ఇప్పటి వరకు కాలానుగుణంగా వచ్చే ఫ్లూ, వైరల్‌ ఫీవర్స్‌ వంటి వాటి బారిన పడలేదు. 

అంటే మాస్కులు, భౌతిక దూరం కారణంగా సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం వంటి రాకపోవడంతో వారిలో రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందలేదు. దీని ఫలితంగా కరోనా అనంతర రోజుల్లో వారి శరీరాలు  రానున్న బగ్స్‌తో పోరాడేందుకు రోగనిరోధక వ్యవస్థ అభివృద్ది చేసుకోలేపోయాయి.

అదేవిధంగా రెసిపిరేటరీ సిన్సిటియన్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వి)పై ఆందోళన వ్యక్తం చేసిన వైరాలజిస్టులు  ఈ వైరస్‌ల వల్ల తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెన్‌కు దారి తీస్తుందని కూడా చెబుతున్నారు. కొన్ని సార్లు సంవత్సరం లోపు పిల్లల మరణాలకు కూడా కారణమౌతుందని పేర్కొన్నాన్నారు.

కోవిడ్‌ రోజులకు ముందు కాలానుగుణంగా వచ్చే ఫ్లూల కంటే ఆర్‌ఎస్‌వి వల్ల పిల్లలు ఎక్కువ మంది ఆస్పుత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ కరోనా సమయంలో మాస్కులు, భౌతిక దూరం వంటివి చిన్నారులు అత్యధికంగా రోగాల బారిన పడకుండా చేశాయని చెబుతున్నారు.

పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే .ఆర్‌ఎస్‌పి ప్రాణాంతకంగా మారవచ్చునని హెచ్చరిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరంం, ఇతర కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ వంటివి రద్దు చేస్తే వారు కోవిడ్‌ బారిన పడే అవకాశాలున్నాయని తెలిపారు. రిపోర్టు ప్రకారం యుకెలో కోవిడ్‌కు ముందు ఆర్‌ఎస్‌వి కారణంగా 30 వేల మందికి పైగా ఐదేళ్ల లోపు చిన్నారులు ఆసుపత్రిలో చేరారు.