యోగా డేన ఇండియా పోస్ట్ స్పెష‌ల్ క్యాన్సిలేష‌న్‌!

ప్ర‌తి యేటా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ఇండియా పోస్ట్.. స్టాంపులు జారీ చేసేది. కానీ ఈ సంస్థ చ‌రిత్ర‌లో తొలిసారి స్పెష‌న‌ల్ క్యాన్సిలేష‌న్‌ను ఆవిష్క‌రించ‌నున్న‌ది. ఇందుకు అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం వేదిక కానున్న‌ది.

ఏడ‌వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంస్మ‌ర‌ణార్థం ఈ నెల 21 (సోమ‌వారం) ప్ర‌త్యేక క్యాన్సిలేష‌న్ ఆవిష్క‌రిస్తార‌ని ఆయుష్ మంత్రిత్వ‌శాఖ  ప్ర‌క‌టించింది. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా 810 హెడ్ పోస్టాఫీసుల్లో ఒక పిక్చ‌ర‌ల్ డిజైన్‌తో ప్ర‌త్యేక క్యానిలేష‌న్ జారీ అవుతుంది.

అన్ని డెలివ‌రీ, నాన్ డెలివ‌రీ హెడ్ పోస్టాఫీసుల‌న్నీ ఈ నెల 21వ తేదీన బుక్ చేసుకునే అన్ని మెయిల్ స‌ర్వీసుల‌పై ఈ స్పెష‌ల్ క్యాన్సిలేష‌న్ స్టాంప్‌ను అతికిస్తారు. హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ డే ఆఫ్ యోగా-2021 అని రాసి ఉన్న గ్రాఫిక‌ల్ డిజైన్‌తోపాటు ప్ర‌త్యేక పిక్చ‌ర‌ల్ క్యాన్సిలేష‌న్ స్టాంప్‌ను ఆవిష్క‌రిస్తారు.

పోస్ట‌ల్ స్టాంప్‌ల అధ్య‌య‌నం కోసం స్పెష‌ల్ పోస్ట్ క్యాన్సిలేష‌న్ నిర్వ‌హిస్తున్నారు. 2015 జూన్ 21న తొలిసారి అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం జ‌రిగింది. అప్పుడు ఇండియా పోస్ట్ రెండు స్టాంప్‌ల మీనియేచ‌ర్ షీట్‌ను ఆవిష్క‌రించారు. 2016లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ.. సూర్య న‌మ‌స్కార‌తో కూడిన స్టాంప్‌ను విడుద‌ల చేశారు.

2017లో యూఎన్ పోస్ట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ (యూఎన్పీఏ) ప‌ది యోగాస‌నాలతో కూడిన స్టాంప్‌ల సెట్‌ను ఆవిష్క‌రించింది. అంత‌కుముందు జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం అని పేర్కొంటూ.. 2014 డిసెంబ‌ర్ 11వ తేదీన ఐక్య‌రాజ్య‌స‌మితి సాధార‌ణ అసెంబ్లీ (యూఎన్జీఏ) తీర్మానం ఆమోదించింది.