ప్రజాదరణలో అగ్రగామి ప్రధాని నరేంద్ర మోదీ 

ప్రజాదరణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో ఇతర దేశాల నేతల కన్నా ముందు వరుసలో ఉన్నారు. అమెరికన్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘ది మోర్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో మోదీకి అత్యధిక ఓట్లు లభించాయి. ఈ సర్వేలో మొత్తం 13 దేశాల నేతలపై అభిప్రాయాలను సేకరించారు.

అమెరికా, బ్రిట‌న్‌తో పాటు 13 దేశాల నాయ‌కుల‌ను తోసిరాజ‌ని మోదీ అగ్ర‌స్థానంలో నిలిచారు. మోదీకి వ‌చ్చిన జనాదరణ 100 లో 66 శాతంగా ఉన్న‌ది. అయితే, గ‌త ఏడాది ల‌భించిన ప్ర‌జాద‌ర‌ణ ఈసారి 20 శాతం త‌క్కువ‌గా ఉండ‌టం విశేషం. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌, భారతదేశంలో దాని చెడు ప్రభావాల తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉన్న‌ద‌ని ఈ స‌ర్వే వెల్ల‌డిస్తున్న‌ది.

‘ది మోర్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ సర్వేలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, భారత దేశం సహా  13 దేశాల నేతలపై అభిప్రాయాలను సేకరించారు.  ఎన్నికైన ప్రజా ప్రతినిధుల నేషనల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేశారు. 

గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్‌ను గురువారం అప్‌డేట్ చేశారు. భారత దేశంలో 2,126 మంది వయోజనులు ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఈ సంస్థ తెలిపింది. మోదీకి 66 శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చిందని, 28 శాతం మంది ఆయనను ఆమోదించలేదని తెలిపింది.

తాజా సర్వేలో మోదీకి ప్రథమ స్థానం రాగా, రెండో స్థానంలో ఇటలీ ప్రధాన మంత్రి మరియో డ్రఘి (65 శాతం) నిలిచారు. మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడోర్ 63 శాతం అప్రూవల్ రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. 

ఈ సర్వేలో భారతదేశానికి చెందిన 2,126 మందిని చేర్చారు. ఇందులో 28 శాతం మంది మోదీ ప్రజాదరణను అంగీకరించలేదు. సర్వేలో కేవలం 3 దేశాల నాయకుల రేటింగ్ 60 శాతం పైన ఉండ‌టం విశేషం. సర్వేలో మోదీ తర్వాత ఉన్న ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో ద్రాగి రేటింగ్ 65 శాతం. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ మూడవ స్థానంలో 63 శాతం రేటింగ్‌తో ఉన్నారు.

ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్ (54 శాతం), జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (53 శాతం), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (53 శాతం), కెనడా పీఎం జస్టిన్ ట్రుడూ (48 శాతం), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44 శాతం), దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ జే ఇన్ (37 శాతం), స్పానిష్ స్పెయిన్ పెడ్రో శాంచెజ్ (36 శాతం), బ్రెజిల్ ప్రెసిడెంట్ జైరే బోల్సోనారో (35 శాతం), ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాక్రన్ (35 శాతం), జపనీస్ పీఎం యొషిహిడే సుగ (29 శాతం) నిలిచారు. 

జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదా కల్పించిన అధికరణ 370ని రద్దు చేసిన నేపథ్యంలో 2019 ఆగస్టులో మోదీకి 82 శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు ఈ సంస్థ తెలిపింది. ఈ నెల 7న మోదీ చేసిన ప్ర‌సంగంతో ఆయన రేటింగ్ శాతం పెరగ‌డానికి దోహ‌ద‌ప‌డింద‌ని ప‌లువురు నిపుణులు వాదిస్తున్నారు. దేశంలోని 18 ఏండ్ల వ‌య‌సు పైబ‌డిన వారందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు అంద‌జేస్తామ‌ని మోదీ చెప్ప‌డంతో ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో కొంత ఆద‌ర‌ణ పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చున‌ని వారంటున్నారు