వంట నూనెలపై 20 శాతం వరకు సుంకం తగ్గింపు 

భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులుపడిన వినియోగదాడులకు ఊరట కలించేందుకు  వంట నూనెల దిగుమతి సుంకంను భారీగా తగ్గిస్తూ కేంద్ర  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  
 
కేంద్ర పరోక్ష పన్నులు , కస్టమ్స్ బోర్డు ఆ మేరకు  దిగుమతి  తగ్గింపు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కొత్త రేట్లు గురువారం నుండి అమలులోకి వచ్చాయి. గత ఏడాది కాలంగా వంట నూనెల ధరలు సుమారు రెట్టింపయ్యాయి.
ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని టన్నుకు  87 డాలర్లు తగ్గి  1136 కు తగ్గించగా, ముడి సోయా చమురు దిగుమతి సుంకం  టన్నుకు 37 డాలర్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం దీని ధర టన్నుకు 1415 డాలర్లుగా ఉంది. అటు ఆర్బిడి పామాయిల్ పై టన్నుకు 1148 డాలర్లకు దిగివచ్చింది.
తాజా తగ్గింపుతో  దేశీయంగా ఆవాలు, సోయాబీన్, వేరుశనగల రేట్లు కూడా  దిగిరానున్నాయి. ఈ తగ్గింపు కారణంగా మార్కెట్ లో తగ్గిన వంటనూనెలు వివరాలు:

పామాయిల్   రూ.115,  (పాత ధర142, 19 శాతం తగ్గింది)
పొద్దుతిరుగుడు నూనె  రూ. 157 (పాత ధర రూ .188, 16 శాతం తగ్గింది)
సోయా నూనె  రూ.138 ( పాత ధర రూ. 162 , 15 శాతం తగ్గింది)
ఆవ నూనె రూ.157 (పాత ధర రూ. 175 , 10 శాతం తగ్గింపు)
వేరుశనగ నూనె   రూ. 174,(పాత ధరరూ.190, 8 శాతం తగ్గింపు)
వనస్పతి రూ.  141 (పాత ధర 184, 8 శాతం తగ్గింపు)