రైతుల ఆదాయాన్నిపెంచడానికి ఈ కేంద్రాలు

రైతుల ఆదాయాన్నిపెంచడానికి ఈ కేంద్రాలు

ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యానవన రంగాన్నిముందుకు తీసుకెళ్లేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ (ఐఐఏపి) కింద కర్ణాటకలో ఏర్పాటు చేసిన 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఇఇ) లను సంయుక్తంగా ప్రారంభించారు.

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఎంఐడిహెచ్ విభాగం,కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ అభివృద్ధి సహకారానికి ఇజ్రాయెల్ కి చెందిన ఏజెన్సీ-మాషవ్,12 రాష్ట్రాలలో 29 ఆపరేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఇఇ)తో అధునాతన ఇజ్రాయెల్ వ్యవసాయ- సాంకేతికత స్థానికపరిస్థితులకు అనుగుణంగా ఇజ్రాయెల్ కి చెందిన అతిపెద్ద జి 2 జి సహకారానికి నాయకత్వం వహిస్తున్నాయి.

“ఈ కేంద్రాలు కర్ణాటక వ్యవసాయానికి సరికొత్త వినూత్న ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి సహాయపడతాయని ‘ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రినరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.  ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన సూచనలు అవలంబించడానికి రైతుల ఆదాయాన్నిపెంచడంలో సహాయపడతాయని చెప్పారు. 

ఈ సిఓఈలు ఏటా 50,000 అంటు మొక్కల ఉత్పత్తి, 25 లక్షల కూరగాయల మొలకల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉద్యానవనంలో ఆధునిక సాగు పద్ధతుల గురించి అవగాహన పొందడానికి సుమారు 20వేల మంది రైతులు ఈ సిఓఈ లను సందర్శించవచ్చని ఆయన వివరించారు.