హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌

పారిశ్రామిక, ఐటీ, ఇతర అంతర్జాతీయస్థాయి సంస్థల్లో ఏర్పడే వివాదాల పరిషారాల కోసం ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (మధ్యవర్తిత్వ కేంద్రం)ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. సింగపూర్‌లోని ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ తరహాలోనే హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకోసం ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేశ్‌ మీనన్‌కు ప్రతిపాదన పంపినట్టు చెప్పారు. 

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి అన్ని వసతుల కల్పిస్తామని చెప్పారని వెల్లడించాయిరు. ఆర్బిట్రేషన్‌ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ అధికారి ఉంటారని చెప్పారు. మంగళవారం రాజ్‌భవన్‌ అతిథి గృహంలో హైకోర్టు లీగల్‌ రిపోర్టర్లతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 

అంతర్జాయతీయ స్థాయి కంపెనీలు (ఎంఎన్‌సీ) ఏర్పాటుకావడం ఒక ఎత్తు, వాటిలో తలెత్తే వివాదాలు సత్వర పరిషారం మరొక ఎత్తని, వివాదాలు వెంటనే పరిషారమైతేనే ఎంఎన్‌సీ సంస్థలు దేశంలో.. ప్రధానంగా ఉన్నత ప్రమాణాలున్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని చెప్పారు. 

ఇలాంటి వివాదాలను సింగపూర్‌లోని ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో పరిషారానికి ఎంఎన్‌సీ సంస్థలు వెళ్తున్నాయని వివరించారు. అకడికి వెళ్లేందుకు న్యాయవాదులకు భారీ మొత్తంలో ఫీజులు, ప్రయాణ ఖర్చులు, అంతర్జాతీయ ప్రమాణాలున్న హోటళ్లలో బస్ వంటివాటికి భారీగా ఖర్చు అవుతున్నదని తెలిపారు. అదే ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తే అవన్నీ ఇకడకే వస్తాయని చెప్పారు.

టెక్నాలజీలో మనమే టాప్‌

ప్రపంచంలోని అనేక కోర్టుల్లో లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మన సుప్రీంకోర్టులో వినియోగిస్తున్నామని సీజేఐ తెలిపారు. కేసుల సత్వర పరిషారానికి వినియోగిస్తున్న ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ కావాలని సింగపూర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మీనన్‌ కోరారని, ఆ సమయంలోనే హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదనచేసినట్టు వివరించారు.

జస్టిస్‌ మీనన్‌ ఆగస్ట్‌లో భారత్‌కు రానున్నారని, అప్పుడు ఆయనతో చర్చించి ఫలితం సానుకూలంగా వచ్చేలా కృషిచేస్తానని పేర్కొన్నారు. ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో ఉన్నత ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కీలకమని తెలిపారు. అంతర్జాతీయ కోర్టు కేసుల్ని వాదించే న్యాయవాదులు వస్తే హైదరాబాద్‌లో బసచేసేందుకు అన్ని వసతులతో కూడిన హోటల్స్‌ ఉన్నాయని చెప్పారు. 

ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలంటే దానిపై అప్పీల్‌ చేసేందుకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరం ఐటీ, ఫార్మా రంగాల్లో అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తున్నదని, అలాంటి ఎంఎన్‌సీ కంపెనీల విదాదాలు ఎంత త్వరగా పరిషారమైతే అంతే వేగంగా హైదరాబాద్‌లో ఎంఎన్‌సీ కంపెనీలు కొత్తగా ఏర్పాటవుతాయని చెప్పారు. 

మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి కంపెనీల్లో న్యాయ వివాదం తలెత్తితే వెంటనే పరిషారం కావాలని అవి కోరుకుంటాయని తెలిపారు. ఏదైనా కంపెనీ ఏర్పాటు చేయాలంటే ఇకడ న్యాయ వివాదం ఏర్పడితే ఎన్నాళ్లలోగా అవి పరిషారమవుతాయో ఆరా తీస్తున్నాయని చెప్పారు. తాను సీజేఐ హోదాలో ఉన్నప్పుడే ఈ కలను సాకారం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

లైవ్‌ ఇస్తే బాగానే ఉంటుంది

తీర్పుల ప్రతులు సుప్రీంకోర్టు తరహాలో అన్ని హైకోర్టుల్లోనూ వెంటనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసే అంశంపై కసరత్తు జరుగుతున్నదని జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. ఇందుకు సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేస్తున్నామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని తెలిపారు. దీనివల్ల తీర్పు కాపీ అందలేదని చెప్పి జాప్యం చేయడానికి వీలుండదని స్పష్టం చేశారు. 

వాద ప్రతివాదులకు ఈమెయిల్‌ ద్వారా తీర్పు కాపీ పంపేందుకు వీలవుతుందని, తీర్పు ప్రతిని వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకొనే వీలుంటుందని వివరించారు. కర్ణాటక, గుజరాత్‌ హైకోర్టులు విచారణను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తున్నాయని, కేసుల అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రజాహిత వ్యాజ్యాలు వంటివి ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రతిపాదన ఉందని తెలిపారు.

అంతకు ముందు  ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీజేఐ హోదాలో జస్టిస్‌ ఎన్వీ రమణ మంగళవారం తొలిసారిగా సందర్శించారు. . జస్టిస్‌ దంపతులు స్వామి అమ్మవార్లకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. సుమారు గంటపాటు బాలాలయంలోనే పూజలు చేశారు. అనంతరం జస్టిస్‌ దంపతులు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

ఆలయ పునర్నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించిన జస్టిస్‌ రమణ రాష్ట్ర ప్రభుత్వ కృషిపై ప్రశంసలు కురిపించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా తెలంగాణ ప్రభుత్వం ఆలయ నిర్మాణాలను చేపట్టిందని కొనియాడారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా ఆలయ నిర్మాణం చేస్తున్నది’ అని విజిటర్స్‌ బుక్‌లో రాశారు.