మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
గతంలో ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ.. సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. గత ఏడాది జీవోలను సవాల్ చేస్తూ అశోక్‌గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోలుగా రాత్రికి రాత్రి రహస్య జి.ఓ.ల ద్వారా సంచైతా గజపతిరాజుని నియమించారని అశోక్ తరపు నాయ్యవాదులు వాదనలు వినిపించారు.
ఈ నియామకం చెల్లదని, ఆమెని తొలగించాలని కోర్టుకు ఆధారాలు కూడా సమర్పించారు. ఆధారాలతో ఏకీభవించిన హైకోర్టు సంచైత గజపతిరాజును రెండు ట్రస్ట్‌ల నుండి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చింది. పాత జీవోల ప్రకారం మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా అశోక్ ఉంటారని పేర్కొంది.
దానితో సింహాచలమ వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్ కు ఆయనే చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా పునర్నియమించాలని పేర్కొంది. ప్రస్తుతం ఆ ట్రస్టుకు సంచయిత గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే.
More Stories
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ జఠిలమైన సమస్య
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి